Video: జైస్వాల్‌పై కోహ్లి పంచ్‌లు.. సల్మాన్ స్టెప్పులతో నవ్వులు పూయించాడుగా..
Virat Kohli Made Fun With Yashasvi Jaiswal: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు ముందు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఆటపట్టిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Virat Kohli Made Fun With Yashasvi Jaiswal: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో సందడి చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెయిర్ స్టైల్ చూసి కోహ్లీ సరదాగా ఆటపట్టించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
మ్యాచ్ ప్రారంభానికి ముందు యశస్వి జైస్వాల్ హెయిర్ స్టైల్ ‘తేరే నామ్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ‘రాధే’ పాత్రను పోలి ఉండడాన్ని కోహ్లీ గమనించాడు. దీంతో వెంటనే కోహ్లీ ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ చేసే ప్రసిద్ధ డ్యాన్స్ స్టెప్పులను అనుకరిస్తూ జైస్వాల్‌ను ఆటపట్టించాడు.
నవ్వుల్లో మునిగిన టీం..
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి పక్కనే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ వంటి ఇతర ఆటగాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 120 బంతుల్లో 135 పరుగులు (11 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి తన కెరీర్‌లో 83వ అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశారు. ఈ ప్రదర్శనకు గాను ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Kohli trolling Jaiswal’s hairstyle with Salman’s dance in Tere naam 🤣 pic.twitter.com/V9jF1PccKK
— Gangadhar (@90_andypycroft) November 30, 2025
మరోవైపు యశస్వి జైస్వాల్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కోహ్లీ శతకం కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
గ్రౌండ్‌లో సీరియస్‌గా ఉండే కోహ్లీ, ఇలా సరదాగా సహచర ఆటగాళ్లతో గడపడం అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








