Virat Kohli: ఒక్క ఇన్నింగ్స్‌తో మారిపోయిన ‘కోహ్లీ’ కథాచిత్రమ్.. ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్‌..

ICC T20 Rankings: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ కీలక ఇన్నింగ్స్ దెబ్బకు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారీ బహుమతి లభించింది.

Virat Kohli: ఒక్క ఇన్నింగ్స్‌తో మారిపోయిన 'కోహ్లీ' కథాచిత్రమ్.. ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్‌..
Virat Kohli
Follow us

|

Updated on: Oct 26, 2022 | 5:02 PM

పాకిస్థాన్‌పై తన కెరీర్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీగా దూసుకొచ్చాడు. తాజాగా బుధవారం విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఈ కుడిచేతి వాటం మాజీ సారథి టాప్-10లోకి చేరాడు. దీంతో తన అభిమానులకు కూడా ఓ గుడ్ న్యూస్ అందినట్లైంది. అది కూడా కేవలం మూడు నెలల్లోనే కీలక మార్పులు రావడంతో.. ఇప్పుడంతా కాలర్ ఎగరేస్తున్నారు. పాకిస్థాన్‌పై కోహ్లి అజేయంగా 82 పరుగులు చేయడంతో తొమ్మిదో నంబర్‌కి దూసుకొచ్చాడు. ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 635 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకోవడంతో.. మరోసారి తన పూర్వ వైభావాన్ని ప్రదర్శించాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం రెండో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు.

మూడు నెలల్లో మారిన కోహ్లీ కథాచిత్రమ్..

గత మూడేళ్లుగా కోహ్లీ చాలా కష్టాలు పడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ రాలేదు. కానీ, ఆసియా కప్-2022లో, కోహ్లి తన ఫామ్‌కు తిరిగి వచ్చాడు. అతను మరోసారి తన పాత శైలిలో కనిపించాడు. ఇది మూడు నెలల క్రితం నాటి మాట. ఆ సమయంలో ఆసియా కప్ ప్రారంభం కానుండడంతో విరాట్ ర్యాంకింగ్ 35వ స్థానంలో ఉంది. దీంతో కింగ్ కోహ్లి ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ చేసి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు టాప్ 10లోకి చేరాడు. 2019 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీని తర్వాత ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఓవరాల్‌గా 71వ సెంచరీని నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో మారిన రాత..

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. కోహ్లి 82 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. హార్దిక్‌తో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన సమయంలో నోబాల్‌లో సిక్సర్‌ బాది జట్టుకు విజయ మార్గాన్ని చూపించాడు కోహ్లి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ ఎంపికయ్యాడు.

విరాట్‌ ఈ ఇన్నింగ్స్‌ చరిత్రాత్మకంగా నిలిచింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ అంతా కలిసి 67 పరుగులు మాత్రమే చేయగలిగారు. మరోవైపు విరాట్‌ బ్యాటింగ్‌లోనే 82 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా ఓటమి అంచుకు చేరిన జట్టుకు విజయం అందించాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం భారత్‌పై గోల్డెన్ డక్‌కి గురయ్యాడు. ర్యాంకింగ్స్‌లో కూడా దీని భారాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాబర్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు. టాప్-10లో ఉన్న ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నారు.

దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ ఐదో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఏడో స్థానంలో, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిశాంక ఎనిమిదో స్థానంలో ఉన్నారు. యూఏఈకి చెందిన మహ్మద్ వసీం 10వ స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 16వ ర్యాంక్‌లో ఉండగా, కేఎల్ రాహుల్ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.