T20 WC 2022 Points Table: గ్రూప్ 1లో పెరిగిన సెమీస్ ఉత్కంఠ.. టాప్ 2 కోసం 5 టీంల హోరాహోరీ పోరు..
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 గ్రూప్-2 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా రెండో స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
టీ20 వరల్డ్ కప్ 2022 (T20 WC 2022) సూపర్-12 రౌండ్‌లోని మొత్తం 12 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. అయితే, గ్రూప్ 2లోని 6 టీంలు మాత్రం తలో రెండు మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. అలాగే గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ రౌండ్‌లో ప్రతి జట్టు తమ గ్రూప్ లోని ఇతర ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ క్రమంలో సూపర్ 12 పాయింట్ల పట్టికలో మార్పులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
Super 12 Group 1 Points Table: ప్రస్తుతం గ్రూప్-1లో శ్రీలంక జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సూపర్-12 తొలి మ్యాచ్‌లో కివీ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కీలక పోరులో లంకను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. ప్రస్తుతం ఈ గ్రూపులో అన్ని జట్లు రెండు మ్యాచ్‌లు ఆడాయి. రెండో స్థానంలో ఇంగ్లండ్ జట్టు నిలిచింది. కాగా గ్రూప్ 2 లో నేడు జరిగిన రెండు మ్యాచ్‌లకు వర్షం అడ్డుపడింది. దీంతో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్ తలపడగా, డీఎల్‌ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీస్ లెక్కలను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
జట్టు | మ్యాచ్ | విజయం | ఓటమి | పాయింట్లు | నికర రన్ రేట్ |
న్యూజిలాండ్ | 2 | 1 | 0 | 3 | 4.450 |
శ్రీలంక | 2 | 1 | 1 | 2 | 0.450 |
ఇంగ్లండ్ | 2 | 1 | 1 | 2 | 0.239 |
ఐర్లాండ్ | 2 | 1 | 1 | 2 | -1.169 |
ఆస్ట్రేలియా | 2 | 1 | 1 | 2 | -1.555 |
ఆఫ్ఘనిస్తాన్ | 2 | 0 | 1 | 1 | -0.620 |
Super 12 Group 2 Points Table: గ్రూప్-2 లో బంగ్లాదేశ్ టీం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు మాత్రమే చెరో 2 పాయింట్లతో నిలిచాయి. గ్రూప్ 2 మ్యాచ్‌లు నేడు లేవు. రేపు ఈ గ్రూపులో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, భారత్ vs నెదర్లాండ్స్, పాకిస్థాన్ vs జింబాబ్వే తలపడనున్నాయి.
జట్టు | మ్యాచ్ | విజయం | ఓటమి | పాయింట్లు | నికర రన్ రేట్ |
బంగ్లాదేశ్ | 1 | 1 | 0 | 2 | 0.450 |
భారతదేశం | 1 | 1 | 0 | 2 | 0.050 |
దక్షిణ ఆఫ్రికా | 1 | 0 | 0 | 1 | – |
జింబాబ్వే | 1 | 0 | 0 | 1 | – |
పాకిస్తాన్ | 1 | 0 | 1 | 0 | -0.050 |
నెదర్లాండ్స్ | 1 | 0 | 1 | 0 | -0.450 |