AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఐపీఎల్ 2026లో విరాట్ డకౌట్ రికార్డ్.. కెరీర్‌లో ఇలా రెండోసారి.. అసలేం జరుగుతోంది?

Virat Kohli : విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా రెండుసార్లు డకౌట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. దీనికి ముందు 2022 సీజన్‌లో విరాట్ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి వరుస వైఫల్యాలు కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడికి ఎదురవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Virat Kohli : ఐపీఎల్ 2026లో విరాట్ డకౌట్ రికార్డ్.. కెరీర్‌లో ఇలా రెండోసారి.. అసలేం జరుగుతోంది?
Virat Kohli (7)
Rakesh
|

Updated on: May 11, 2026 | 8:10 AM

Share

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రన్ మెషీన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీకి ఐపీఎల్ 2026 సీజన్ ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. తన అద్భుతమైన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్, ఆ తర్వాత రాయ్‌పూర్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇలాంటి వరుస వైఫల్యాలు కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడికి ఎదురవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?

విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా రెండుసార్లు డకౌట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. దీనికి ముందు 2022 సీజన్‌లో విరాట్ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అప్పట్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దుష్మంత చమీర బౌలింగ్‌లో మొదటి బంతికే అవుట్ అయిన కోహ్లీ, ఆ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 2022 సీజన్ విరాట్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ సగటు (22.73) నమోదైన సీజన్‌గా నిలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2026లో అదే సీన్ రిపీట్ అవ్వడం ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతోంది.

కోహ్లీ డకౌట్ అయితే ఆర్‌సీబీ పరిస్థితి ఏంటి?

గణాంకాల ప్రకారం చూస్తే విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో త్వరగా అవుట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ సీజన్‌లో కోహ్లీ త్వరగా అవుట్ అయిన 5 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ 4 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ఓపెనర్‌గా వచ్చి కోహ్లీ భారీ స్కోరు సాధిస్తేనే జట్టుకు మంచి పునాది లభిస్తుంది. కానీ వరుస డకౌట్ల వల్ల జట్టు బ్యాటింగ్ లైనప్ ఒత్తిడికి లోనవుతోంది. ప్రత్యర్థి జట్లు కూడా కోహ్లీని ఆరంభంలోనే అవుట్ చేయడానికి పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నాయి.

అరుదైన రికార్డులు.. అప్పుడప్పుడు వైఫల్యాలు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ, ఇప్పటివరకు మొత్తం 12 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే అందులో కేవలం రెండు సార్లు మాత్రమే వరుసగా అవుట్ అవ్వడం ఆయన నిలకడకు నిదర్శనం. ముఖ్యంగా రన్ ఛేజింగ్‌లో కోహ్లీ అవుట్ అవ్వడం చాలా అరుదు. 2017లో కేకేఆర్‌పై ఆర్‌సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయినప్పుడు కోహ్లీ డకౌట్ అయ్యాడు, మళ్లీ ఇప్పుడు 2026లో లక్ష్య ఛేదనలో ఇలా వరుసగా వైఫల్యాలు చెందడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us