Video: వర్త్ వర్మ వర్తు.. మ్యాచ్ పోతే పోయింది కానీ అదిరిపోయే సిక్స్ కొట్టిన తల! చూస్తే వింటేజ్ వైబ్స్ పక్కా!
CSK vs RR మ్యాచ్‌లో ధోని తన వింటేజ్ ఫినిషింగ్ మేజిక్‌ను మరోసారి చూపించాడు. చివర్లో మ్యాచ్ గెలవలేకపోయినా, ఒక అదిరిపోయే సిక్స్ కొట్టి అభిమానులను నోస్టాల్జియాలో ముంచేశాడు. స్టేడియం మొత్తం “ధోని.. ధోని..” అంటూ మార్మోగింది, గౌహతిలో కూడా CSK అభిమానుల హవా కనిపించింది. చివరికి CSK ఓడిపోయినా, ధోని బ్యాటింగ్ మేజిక్ ఐపీఎల్‌లో కొనసాగుతూనే ఉంటుంది.

మహేంద్ర సింగ్ ధోని ఒక కల్ట్ ఐకాన్. అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన అతను, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, ఇప్పటికీ ఐపీఎల్‌లో తన వింటేజ్ మేజిక్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. CSK కి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమైనప్పుడు, ఎల్లో ఆర్మీ ధోని మరోసారి గేమ్ ఫినిష్ చేస్తాడని ఆశతో ఎదురుచూసింది. చివరికి, ధోని మ్యాచును గెలిపించలేకపోయినా, తన స్టైల్‌లో ఫినిష్ చేయాలని ప్రయత్నించాడు. 19వ ఓవర్‌లో, అతను ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన ధోని, నాలుగో బంతికి తన సిగ్నేచర్ ఫ్లాట్ సిక్స్ బాదాడు.
ఆ సిక్స్ మామూలు సిక్స్ కాదు.. మునుపటి ఐపీఎల్‌లలోని ధోని హిట్స్‌ను గుర్తు తెచ్చింది. ఇది స్లో లెంగ్త్ బంతి, అవుట్‌సైడ్ ఆఫ్, ధోని తన మాస్ స్టాండ్‌లోకి వెళ్లి అదిరిపోయే సిక్స్ కొట్టాడు. CSK శిబిరంలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది.
ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అయిన గౌహతిలో జరిగింది. అయితే, ధోని బరిలో ఉన్నప్పుడు, ఎక్కడైనా స్టేడియం పసుపు రంగులోకి మారిపోతుంది. అభిమానులు “ధోని… ధోని…” అంటూ నినాదాలు పెట్టారు, గౌహతిలో రాజస్థాన్ ఫ్యాన్స్ కన్నా CSK అభిమానులే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.
అదే ఓవర్లో రవీంద్ర జడేజా కూడా ఒక సిక్స్ కొట్టి, పాత జంట మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశించారు. ధోని-జడేజా మరోసారి మ్యాచ్‌ను తిరగరాస్తారా? అన్న ఉత్కంఠ పెరిగింది.
అయితే, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. ధోని లాంగ్ ఆన్ బౌండరీ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. జామీ ఓవర్టన్ ఒక భారీ షాట్ ఆడినా, అది మ్యాచ్‌ను గెలిపించేందుకు సరిపోలేదు.
చివరికి CSK ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది, కానీ ధోని తన వింటేజ్ ఫినిషింగ్ షాట్లతో అభిమానులకు మరింత నోస్టాల్జియా మిగిల్చాడు.
ధోని ఉన్నంత కాలం ఐపీఎల్ మ్యాజిక్ కొనసాగుతూనే ఉంటుంది. తన బ్యాటింగ్ చూసేందుకు, అతను మళ్లీ ఓ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడా? అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. RR vs CSK మ్యాచ్ ఎంతగా ఉత్కంఠ భరితంగా సాగిందో అభిమానులు నేరుగా అనుభవించారు. ధోనికి ఓటమి ఎదురైనా, ఆఖరి వరకూ అందర్నీ కుర్చీల అంచున ఉంచాడు.
MS Dhoni™️
Watch the LIVE action on JioHotstar!#IPLonJioStar 👉 #RRvCSK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/0Rhrp7PfLU
— Star Sports (@StarSportsIndia) March 30, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..