AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు ప్రాణ స్నేహితులు.. నేడు దూరం, దూరం.. అసలు సచిన్, కాంబ్లీలు ఎందుకు విడిపోయారో తెలుసా?

Vinod Kambli - Sachin Tendulkar: టీం ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో అతను తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. కాంబ్లీ మద్యానికి బానిసయ్యాడు, ఈ కారణంగా అతని సహచర క్రికెటర్లు చాలా మంది అతనికి దూరమయ్యారు. అతడిని కలిసేటప్పుడు సచిన్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.

నాడు ప్రాణ స్నేహితులు.. నేడు దూరం, దూరం.. అసలు సచిన్, కాంబ్లీలు ఎందుకు విడిపోయారో తెలుసా?
Vinod Kambli - Sachin Tendulkar
Venkata Chari
|

Updated on: Dec 09, 2024 | 12:17 PM

Share

Vinod Kambli – Sachin Tendulkar: వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్‌లకు ముంబై కోచ్ రమాకాంత్ అచ్రేకర్ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే, వారిద్దరూ ఆయన స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్ననాటి స్నేహితులిద్దరి కలయికను చూసి అభిమానులు చాలా సంతోషించారు. అయితే, సచిన్‌ను కలిసేటప్పుడు కాంబ్లీ చాలా అసౌకర్యంగా కనిపించాడు. కాంబ్లీ అతడిని పట్టుకుని కాసేపు ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, సచిన్ మాత్రం చేయి వదులుకుని అటువైపు వెళ్లి కూర్చున్నాడు. ఇంతలో, సంజయ్ మంజ్రేకర్ చెప్పిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సచిన్‌ని పదే పదే విమర్శిస్తూ కాంబ్లీ ఎలా వేధించేవాడో మూడేళ్ల క్రితం చెప్పాడు.

సచిన్ బ్యాటింగ్ కాంబ్లీకి నచ్చలేదు..

భారత జట్టు మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, సచిన్, వినోద్ కాంబ్లీ ముంబైకి చెందినవారు. ఈ ముగ్గురూ కలిసి టీం ఇండియా తరపున ఆడారు. 3 సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంజ్రేకర్.. సచిన్, వినోద్ కాంబ్లీల మధ్య స్నేహం గురించి కీలక విషయాలు వెల్లడించాడు. కాంబ్లీకి సచిన్ బ్యాటింగ్ నచ్చదని తెలిపాడు. కాంబ్లీ తరచుగా సచిన్‌ను విమర్శించేవాడు. దాని కారణంగా ప్రశాంత స్వభావం గల సచిన్ కలత చెందాడు అంటూ చెప్పుకొచ్చాడు.

1992 ప్రపంచ కప్ నుంచి ఒక ఉదంతాన్ని పంచుకున్న ఆయన.. కాంబ్లీ ఈ టోర్నమెంట్‌లో మొదటిసారి పాల్గొంటున్నట్లు మంజ్రేకర్ చెప్పాడు. అనుభవం లేకపోవడంతో అవకాశాలు రావడం లేదు. మంజ్రేకర్, సచిన్ ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ తర్వాత కాంబ్లీ, సచిన్ వద్దకు వచ్చి అతని బ్యాటింగ్‌ను విమర్శిస్తూ వేగంగా ఆడమని సలహా ఇచ్చేవాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇలాగే సూచించాడు.

ఇవి కూడా చదవండి

సచిన్‌, మంజ్రేకర్‌లు బాగా బ్యాటింగ్‌ చేశారు. అయినా, కాంబ్లీ వచ్చి మ్యాచ్‌ని త్వరగా గెలిపించవచ్చని చెప్పేవాడంట. బౌలర్‌పై ఫోర్లు, సిక్సర్లు కొట్టాల్సి ఉంటుందని, అయితే సింగిల్స్ తీస్తున్నావంటూ సచిన్‌తో చెప్పాడు. అయితే, తరువాత అతనికి అవకాశం వచ్చినప్పుడు, అతను స్వయంగా పాకిస్తాన్‌పై 41 బంతుల్లో 24 పరుగులు చేయగలిగాడు. దీనిపై సచిన్ కూడా ప్రశ్నించాడు.

సచిన్-కాంబ్లీల స్నేహం ఎలా చెడిపోయింది..

ఓ రియాల్టీ షోలో వినోద్ కాంబ్లీ మాట్లాడుతూ.. విపత్కర సమయాల్లో సచిన్ సహాయం చేయలేదంటూ ఆరోపించారు. ఇది వారి స్నేహంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సచిన్ చాలా బాధపడ్డాడు. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. చాలా ఏళ్లుగా ఇద్దరూ కలవలేదు, మాట్లాడుకోలేదు. సచిన్ కూడా కాంబ్లీ రిటైర్మెంట్ సమయంలో ప్రసంగిస్తున్నప్పుడు అతని పేరును కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..