AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : వామ్మో.. వైభవ్ సూర్యవంశీని చూసి షేక్ అవుతున్న ఆ రికార్డులు

Vaibhav Suryavanshi : ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా ఒకే ఒక పేరు జపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల బీహార్ కుర్రాడు, క్రిస్ గేల్ వంటి దిగ్గజాల రికార్డులకే ఎసరు పెడుతున్నాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ టార్గెట్ చేస్తున్న ఆ ఐదు రికార్డులు ఏంటో వివరంగా చూద్దాం.

Vaibhav Suryavanshi  : వామ్మో.. వైభవ్ సూర్యవంశీని చూసి షేక్ అవుతున్న ఆ రికార్డులు
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Mar 31, 2026 | 1:09 PM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ అంటేనే రికార్డుల గని. ఇక్కడ ఏ రోజైనా, ఎవరైనా హీరోలు అయిపోవచ్చు. కానీ కొన్ని రికార్డులు మాత్రం కొండల్లా అలానే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా ఒకే ఒక పేరు జపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల బీహార్ కుర్రాడు, క్రిస్ గేల్ వంటి దిగ్గజాల రికార్డులకే ఎసరు పెడుతున్నాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ టార్గెట్ చేస్తున్న ఆ ఐదు రికార్డులు ఏంటో వివరంగా చూద్దాం.

1. అత్యధిక వ్యక్తిగత స్కోరు

ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరునే ఉంది. 2013లో పుణె వారియర్స్ మీద గేల్ కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు (80 బంతుల్లో) చేసి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లో గేల్ చేసిన ఆ 175 పరుగుల రికార్డును దాటడమే నా లక్ష్యం అని ఈ కుర్రాడు ధీమాగా చెబుతున్నాడు.

2. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 17 సిక్సర్లు బాది గేల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఎందరో హార్డ్ హిట్టర్లు వచ్చినా ఆ మార్కును అందుకోలేకపోయారు. కానీ వైభవ్ స్టైలే వేరు. ఇటీవలే ఒక యూత్ టీ20 మ్యాచ్‌లో ఈ కుర్రాడు ఏకంగా 15 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే ఊపును ఐపీఎల్‌లో కొనసాగిస్తే, గేల్ సిక్సర్ల రికార్డు గాలిలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

3. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు

2012 సీజన్‌లో క్రిస్ గేల్ ఏకంగా 59 సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 52 సిక్సర్లతో దగ్గరికి వచ్చాడు. గతేడాది కేవలం 7 మ్యాచ్‌లే ఆడి 24 సిక్సర్లు బాదిన వైభవ్, ఈసారి పూర్తి సీజన్ ఆడితే ఆ 59 సిక్సర్ల రికార్డును ఈజీగా దాటే అవకాశం ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కి సిక్సర్లు కొట్టడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయింది.

4. ఒక సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ 234.34 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ కూడా తక్కువ తిన్లేదు. గతేడాది అతను 206 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ ఏడాది మరింత అనుభవం తోడవ్వడంతో, పవర్‌ప్లేలో వైభవ్ చేసే బాదుడుకి మెగర్క్ రికార్డు కూడా ప్రమాదంలో పడేలా ఉంది.

5. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు

మనం అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్‌ను చూశాం, కానీ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ ఆటగాడూ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టలేదు. క్రిస్ గేల్, జడేజా, రింకూ సింగ్ వంటి వారు 5 సిక్సర్ల వరకు వెళ్లారు కానీ ఆ ఆరో సిక్సర్ మాత్రం ఎవరికీ సాధ్యం కాలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికే సిక్సర్ల వర్షం కురిపిస్తున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన మొదటి ఆటగాడిగా నిలుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​
ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​
వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?
వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?
బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే
బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే