AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనకు వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా కెప్టెన్‌గా ధోని నయా శిష్యుడు

India U19 vs England U19: భారత అండర్-19 జట్టు జూన్ 24న ఇంగ్లాండ్ చేరుకుని, జులై 23 వరకు అక్కడ పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఒక 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 యూత్ వన్డే మ్యాచ్‌లు, 2 (మల్టీ-డే) మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో తలపడనుంది.

IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనకు వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా కెప్టెన్‌గా ధోని నయా శిష్యుడు
Vaibhav Suryavamshi Ayush Matre
Venkata Chari
|

Updated on: May 22, 2025 | 1:27 PM

Share

India U19 vs England U19: భారత జూనియర్ క్రికెట్ కమిటీ, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ 16 మంది సభ్యుల జట్టుకు ముంబైకి చెందిన యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే నాయకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

జూన్ 24 నుంచి జులై 23 వరకు పర్యటన..

భారత అండర్-19 జట్టు జూన్ 24న ఇంగ్లాండ్ చేరుకుని, జులై 23 వరకు అక్కడ పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఒక 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 యూత్ వన్డే మ్యాచ్‌లు, 2 (మల్టీ-డే) మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో తలపడనుంది. వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియాలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యేందుకు ఈ పర్యటన యువ ఆటగాళ్లకు మంచి అవకాశాన్ని కల్పించనుంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ స్టార్స్ కు చోటు..

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆయుష్ మాత్రే, రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే సీఎస్‌కే తరపున 6 ఇన్నింగ్స్‌లలో 206 పరుగులు చేశాడు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 48 బంతుల్లో 94 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ కూడా ఉంది.

ఇక 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విషయానికొస్తే, అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఏడు మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి, 206.56 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అతని అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతిని సిక్సర్‌గా మలచి తన సత్తా చాటాడు.

జట్టు ఎలా ఉందంటే?

అండర్ 19 భారత జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. వికెట్ కీపర్ కం బ్యాటర్ అభిజ్ఞాన్ కుండూను వైస్ కెప్టెన్‌గా నియమించారు. జట్టులో ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం..

భారత అండర్-19 జట్టు (16 మంది సభ్యులు):

  • ఆయుష్ మాత్రే (కెప్టెన్)
  • వైభవ్ సూర్యవంశీ
  • విహాన్ మల్హోత్రా
  • మౌల్యాజ్‌సింహ్ చావ్డా
  • రాహుల్ కుమార్
  • అభిజ్ఞాన్ కుండూ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్)
  • హర్‌వంశ్‌ సింగ్ (వికెట్ కీపర్)
  • ఆర్.ఎస్. అంబ్రీష్
  • కనిష్క్ చౌహాన్
  • ఖిలన్ పటేల్
  • హెనిల్ పటేల్
  • యుధాజిత్ గుహా
  • ప్రణవ్ రాఘవేంద్ర
  • మొహమ్మద్ ఎనాన్
  • ఆదిత్య రానా
  • అనమోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ఆటగాళ్లు:

  • నమన్ పుష్పక్
  • డి. దీపేష్
  • వేదాంత్ త్రివేది
  • వికల్ప్ తివారి
  • అలంక్రిత్ రాపోలె (వికెట్ కీపర్)

ఈ యువ భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుందని, భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు ఆడేందుకు అవసరమైన అనుభవాన్ని పొందుతుందని ఆశిద్దాం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..