AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ముంబై కూడా ఔట్.. హైదరాబాద్ విజయంతో ప్లే ఆఫ్స్‌లోకి ఢిల్లీ క్యాపిటల్స్?

IPL 2025 Playoffs Race: ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్‌లకు సంబంధించి లెక్కలు ముగింపు దశకు వస్తున్నాయి. ప్రస్తుతానికి గుజరాత్, బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ ఇచ్చాయి. ఇక నాలుగో జట్టు గురించి మాత్రం మరో రోజు ఆగాల్సిందే. ఇందు కోసం రెండు జట్లు పోటీపడనున్నాయి.

IPL 2025: ముంబై కూడా ఔట్.. హైదరాబాద్ విజయంతో ప్లే ఆఫ్స్‌లోకి ఢిల్లీ క్యాపిటల్స్?
Mumbai Indians Exit From Ipl
Venkata Chari
|

Updated on: May 20, 2025 | 10:00 AM

Share

IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం ద్వారా, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆశలకు కూడా తెరపడింది. దీంతో ఇప్పుడు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అంటే, ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో మిగిలిన స్థానం కోసం రెండు జట్లు రేసులో మిగిలి ఉన్నాయి – ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండింటి మధ్య, ముంబై ఇండియన్స్ కూడా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడం ఖాయం అని తెలుస్తోంది.

పాయింట్ల పట్టికలో ముంబై ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ?

ముంబై ఇండియన్స్ ఎలా ఓడిపోతుంది.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌లోకి ఎలా ప్రవేశిస్తుంది? ఈ ప్లేఆఫ్ సమీకరణాన్ని అర్థం చేసుకునే ముందు, పాయింట్ల పట్టికలో రెండు జట్ల స్థానాన్ని చూద్దాం. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల తర్వాత ముంబై ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. అంటే, గ్రూప్ దశలో రెండు జట్లకు చెరొక మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఇరుజట్లకు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది.

ముంబై, ఢిల్లీ‌లకు ముఖ్యమైన మ్యాచ్..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ముంబై, ఢిల్లీ జట్లలో ఎవరు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, మే 21 తేదీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ రోజున ముంబై వర్సెస్ ఢిల్లీ ముఖాముఖిగా తలపడ్డాయి. అంటే, ఒకరి జట్టు గెలిస్తే, వారిలో ఒకరి ఓటమి ఖాయం. రెండు జట్లకు ఓడిపోవడం అంటే, ప్లే ఆఫ్స్ నుంచి బయటడడమే అని తెలుసు. ఈసారి రెండు జట్లు వాంఖడేలో ఒకదానికొకటి తలపడుతున్నాయి. కాబట్టి, ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రతీకార మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటే, ముంబై ఇండియన్స్ పురోగతి కథ ఇక్కడ ఆగిపోతుంది.

ఇవి కూడా చదవండి

సమీకరణం ఏం చెబుతుంది?

ప్లేఆఫ్ సమీకరణం ప్రకారం, అది ఢిల్లీ అయినా లేదా ముంబై అయినా, రెండూ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. ఇటువంటి పరిస్థితిలో, మే 21న ఈ ఇద్దరి మధ్య ఘర్షణ మరింత ముఖ్యమైనది అవుతుంది. ఒకరితో ఒకరు తలపడిన తర్వాత, రెండు జట్లు చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడవలసి ఉంటుంది. ఈ సీజన్‌లో ముంబై, ఢిల్లీ జట్లు తొలిసారి పంజాబ్ కింగ్స్ సవాలును ఎదుర్కోవడం ఇదే తొలిసారి.

జైపూర్ రికార్డు ముంబైకి మంచిది కాదు..

ముంబై, ఢిల్లీ రెండూ జైపూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడవలసి ఉంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం రికార్డు ఢిల్లీకి అనుకూలంగా ఉంది. ముంబై కంటే ఇక్కడ ఎక్కువ మ్యాచ్‌లు ఆడడమే కాకుండా, ఎక్కువ విజయాలు కూడా సాధించింది. మునుపటి గణాంకాల ప్రకారం ప్రతిదీ అలాగే ఉంటే, ప్లేఆఫ్ రేసులో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ముందుండటం కష్టమే అనిపిస్తుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..