Vaibhav Sooryavanshi: 38 సిక్సర్లు, 299 పరుగులు.. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త హిస్టరీ..!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈసారి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. అద్భుత స్ట్రైక్‌రేట్, భారీ సిక్సర్లతో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ ఆటగాడు, మరో కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఐపీఎల్ 2026 ప్రారంభం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల చూపు యువ ప్లేయర్లపై పడుతోంది. అందులో ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ పేరు ముందుకు వస్తోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో డెబ్యూ చేసిన ఈ ఆటగాడు, తన 15వ పుట్టినరోజు తర్వాత మరోసారి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. 14 ఏళ్లకే 35 బంతుల్లో శతకం కొట్టి భారత క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అతన్ని అత్యంత వేగంగా శతకం బాదిన భారతీయుడిగా నిలబెట్టింది.
ఐపీఎల్, టీ20 రికార్డులు..
ఐపీఎల్ 2025లో వైభవ్ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 257 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ 206.55గా ఉండటం విశేషం. ఈ ప్రదర్శనలో ఒక శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 701 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు ఉన్నాయి. అతని స్ట్రైక్‌రేట్ 204.37గా ఉండటం అతని అగ్రెసివ్ బ్యాటింగ్‌కు నిదర్శనం. ఇప్పటివరకు 62 సిక్సర్లు బాదాడు.
38 సిక్సర్లు, 299 పరుగులు ఎందుకు కీలకం?
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీకి ఓ భారీ అవకాశం ఉంది. అతను కనీసం 38 సిక్సర్లు కొట్టి, 299 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్లు, 1000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ లక్ష్యం సాధించడం అతనికి అసాధ్యం కాదు. గతంలో అనేక మంది బ్యాటర్లు ఒకే సీజన్‌లో ఈ స్థాయి ప్రదర్శన కనబర్చారు.
ఐపీఎల్‌లో మరో ఘనత..
వైభవ్ ఈ లక్ష్యాన్ని అందుకుంటే, ఐపీఎల్ కెరీర్‌లో కూడా 50కి పైగా సిక్సర్లు, 500కి పైగా పరుగులు పూర్తి చేస్తాడు. ఇది అతని కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అతని దూకుడు కొనసాగితే కొత్త రికార్డులు అతని ముందే నిలబడతాయి. ఈ సీజన్ అతనికి కీలకంగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
