AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలచక్రం తిరగబడి.. మొండికేసిన బతుకుబండి..! ఇదెక్కడి వైపరీత్యం?

చవితి సంబరం అయిపోయింది.. ఇప్పుడు నడుస్తోంది దసరా నవరాత్రులు.. తర్వాత దివాళీ మేళా.. ఆ వెంటనే క్రిస్మస్, సంక్రాంతి! ఇక వారం విడిచి వారం ప్రతిరోజూ పండగే. కానీ, ప్రతిరోజూ పండగ కాదు, ఎండగేనంటోంది ఎల్‌నినో మహమ్మారి. ‘దేరీజే క్రొకొడైల్ ఫెస్టివల్‌’ అని కోరలుచాచిమరీ వెక్కిరిస్తోంది. కాలచక్రం అడ్డం తిరిగి.. బతుకుబండి మొండికేస్తున్న సంకేతాలు ఇప్పుడే భయపెట్టేస్తున్నాయి. జనజీవితాల్ని జడిపించేస్తున్న అకాలపరీక్ష.. సూపర్ ఎల్‌నినో... డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

కాలచక్రం తిరగబడి.. మొండికేసిన బతుకుబండి..! ఇదెక్కడి వైపరీత్యం?
El Nino Impact Telangana
Balaraju Goud
|

Updated on: Oct 17, 2026 | 9:47 PM

Share

గుర్తుందా శీతాకాలం..? అని తడుముకోవాల్సిన పరిస్థితి. అక్టోబర్‌ పోయి నవంబర్-డిసెంబర్ వస్తున్నా వానాకాలం మొహం చాటేసి, శీతాకాలం ఆనవాళ్లే లేక వికృతంగా మారుతోంది వాతావరణం. మంచు కురిసే హేమంతం లేదు.. చల్లటి వెన్నెల కాచే శరదృతువు లేదు.. చూస్తుండగానే క్యాలెండర్ అంతా కరిగిపోతోంది. వేసవి నుంచి మళ్లీ వేసవిలోనే పడిపోతామా అని వెర్రెక్కిస్తోంది. అవును.. కాలచక్రం తిరగబడి కసాబిసా అవుతోంది. ఇంతేనా? ఎల్‌నినో నుంచి రాలిపడే దారుణాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో! తిరగబడ్డ కాలచక్రం! డిసెంబర్‌లో ఎండప్రచండం.. మార్చి, ఏప్రిల్‌లో చలిపంజా.. అకాల వానల గురించి విన్నాం. అకాల ఎండల గురించీ విన్నాం. ఏదో ఒకరోజు-రెండురోజులంటే సరే ఆహ్వానిస్తాం.. అటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తాం కూడా. కానీ, నెలల తరబడి అదే వైపరీత్యం కంటిన్యూ అయితే.. పంటల సాగుతోనే పొట్టపోసుకునే భారత్ లాంటి దేశంలో వానచినుకు కరువైతే..! ఈ మార్చి నుంచి వచ్చే మార్చి దాకా మండే ఎండలతోనే గడిచిపోతే..! కచ్చితంగా అదే జరుగుతోంది మన దేశంలో. ముఖ్యంగా తెలుగునేలపై ఎల్‌నినో వేడిగాలుల ప్రభావం దారుణంగా ఉంది. ఇప్పటికే నైరుతి రుతుపవనం పూర్తిగా ఖర్చయిపోయింది. తెలంగాణలో 18 శాతం, ఏపీలో 25 శాతం వర్షపాతానికి లోటు పడింది. అక్టోబర్ మధ్యలో షురూ కావాల్సిన ఈశాన్య రుతుపవనాల జాడ కూడా లేకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని ఐఎండీ చెబుతున్నా, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నా.. వాటితో కురిసేవన్నీ కంటితుడుపు వానలే. వాతావరణం కాస్తా చల్లబడ్డట్టు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి