రోహిత్ వల్ల కాలే.. కోహ్లీకి 9 ఏళ్లు పట్టె.. నువ్వేందయ్యా వైభవ్.. 2 ఏళ్లకే రూ. 12 కోట్లతో బంఫర్ ఆఫర్..
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ, మైదానంలోనే కాకుండా మార్కెట్ ప్రపంచంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ యువ సంచలనం ఏ కంపెనీతో చేతులు కలుపుతాడో మరియు విరాట్ కోహ్లీ చారిత్రాత్మక రికార్డును అధిగమిస్తాడో లేదో చూడాలి.

భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక 15 ఏళ్ల టీనేజ్ సంచలనానికి ఊహించని ఆఫర్ తలుపు తట్టింది. ఐపీఎల్ వేదికగా తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆకర్షించిన ఆ యువ ఆటగాడి బ్యాట్ స్పాన్సర్‌షిప్ కోసం దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయల వర్షం కురిపించడానికి పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కాసుల వర్షం..
భారత క్రికెట్ తదుపరి సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న 15 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఇటీవలి ఐపీఎల్ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడికి ఏకంగా రూ. 12 కోట్ల వార్షిక స్పాన్సర్‌షిప్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ కార్పొరేట్ టైర్ తయారీ సంస్థ, తన బ్రాండ్ లోగోను వైభవ్ బ్యాట్‌పై ప్రదర్శించేందుకు ఈ చారిత్రాత్మక భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.
కోహ్లీ రికార్డు బద్దలవుతుందా? తెరవెనుక గట్టి పోటీ!
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ ‘SS’ (సరీన్ స్పోర్ట్స్)తో ఏడాదికి రూ. 50 లక్షల విలువైన ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. మూడేళ్ల క్రితం కుదిరిన ఈ కాంట్రాక్ట్ గడువు మరికొద్ది నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చెందిన రెండు దిగ్గజ టైర్ కంపెనీలు ఈ యువ సంచలనాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్‌పై నిషేధంతోపాటు జరిమానా..!
ప్రస్తుతం టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్ల బ్యాట్ స్పాన్సర్‌షిప్ విలువలను గమనిస్తే:
విరాట్ కోహ్లీ (MRF): ఏటా రూ. 12.5 కోట్లతో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు.
శుభ్‌మన్ గిల్ (MRF): తన అద్భుత ఫామ్‌తో ఏడాదికి రూ. 10 కోట్లు అందుకుంటున్నాడు.
రోహిత్ శర్మ (CEAT): టీమ్ ఇండియా సీనియర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏటా రూ. 4 కోట్లు పొందుతున్నాడు.
ఈ సమీకరణాలను బట్టి చూస్తే, కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీకి రూ. 12 కోట్ల ఆఫర్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందంపై సంతకం జరిగితే, విరాట్ కోహ్లీ నెలకొల్పిన రూ. 12.5 కోట్ల రికార్డుకు వైభవ్ చాలా చేరువగా వస్తాడు. లేదంటే కంపెనీల మధ్య పోటీ పెరిగి అంతకంటే ఎక్కువ ఆఫర్ లభిస్తే కోహ్లీ రికార్డు బద్దలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ, మైదానంలోనే కాకుండా మార్కెట్ ప్రపంచంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ యువ సంచలనం ఏ కంపెనీతో చేతులు కలుపుతాడో మరియు విరాట్ కోహ్లీ చారిత్రాత్మక రికార్డును అధిగమిస్తాడో లేదో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
