Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టార్గెట్ 212.. విజయానికి చేరువైన ప్రత్యర్థి జట్టు.. కట్ చేస్తే.. 33 వ ఓవర్ తర్వాత భారీ ట్విస్ట్.. అదేంటంటే?

USA Cricket: 212 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జట్టు.. ఒక దశలో స్కోరు 33.3 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులతో పటిష్ట స్థితికి చేరుకుంది.

టార్గెట్ 212.. విజయానికి చేరువైన ప్రత్యర్థి జట్టు.. కట్ చేస్తే.. 33 వ ఓవర్ తర్వాత భారీ ట్విస్ట్.. అదేంటంటే?
Cricket News
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2022 | 11:25 AM

50 ఓవర్ల మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష్యం పెద్దది ఏమీ కాదు. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మిగిలిన పరుగులు చేయడానికి చేతిలో తగినంత ఓవర్లు మిగిలి ఉన్నాయి. కానీ, అంతలో ఓ ట్విస్ట్ రావడంతో, గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయింది. అదేంటి, అంతలా ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. అమెరికా క్రికెట్ జట్టు సెప్టెంబరు 12న పాపువా న్యూ గినియాతో తలపడిన మ్యాచ్‌లో ఇది జరిగింది.

212 పరుగుల లక్ష్యం..

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాపువా న్యూ గినియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది. 64 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అసద్ వాలా బ్యాట్‌తో పపువా న్యూ గినియా నుంచి ఏకైక అర్ధ సెంచరీ కనిపించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా జట్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జట్టు రన్‌చేజ్‌లోకి దిగినప్పుడు, అది అదే శైలిలో ప్రారంభమైంది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టాప్ బ్యాట్స్‌మెన్ పెద్దగా రిస్క్ తీసుకోకుండా స్కోరు బోర్డును సులభంగా పెంచుకున్నారు. ఒక దశలో స్కోరు 33.3 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులకు చేరుకుంది. మ్యాచ్ పూర్తిగా అమెరికా గ్రిప్‌లో పడినట్లే అనిపించింది. అయితే ఆ తర్వాత జరిగిన షాక్ తో మ్యాచ్ మొత్తం మారిపోయింది.

36 పరుగులకే ఆలౌట్..

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అంటుంటారు. ఇదే ఈ మ్యాచ్ లో చోటు చేసుకుంది. తర్వాతి 36 పరుగులకే అమెరికాకు చెందిన మిగిలిన ఏడుగురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. అమెరికా మిడిల్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలింది. మ్యాచ్‌ను సునాయాసంగా గెలుస్తామని భావించిన జట్టుకు 50 ఓవర్లు కూడా పూర్తి చేయడం కష్టంగా మారింది. 47.2 ఓవర్లలో 185 పరుగులకే అమెరికా జట్టు మొత్తం ఆలౌట్ అయింది. దీంతో అమెరికా జట్టు 26 పరుగుల తేడాతో ఓడిపోయింది.