AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: మ్యాచ్‌లో రూల్స్ బ్రేక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్‌లపై కీలక చర్యలు.. ఏంచేశారంటే?

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సందర్భంగా UP వారియర్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. యూపీ వారియర్స్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్, కిరణ్ నవ్‌గిరే WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ జట్టు మ్యాచ్‌లో WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.

WPL 2024: మ్యాచ్‌లో రూల్స్ బ్రేక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్‌లపై కీలక చర్యలు.. ఏంచేశారంటే?
Wpl 2024
Venkata Chari
|

Updated on: Mar 10, 2024 | 10:15 PM

Share

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇద్దరు స్టార్ ప్లేయర్‌లపై కీలక చర్యలు తీసుకున్నారు. ఈ సీజన్‌లోని 15వ మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్ల మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 1 పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

ఈ ఆటగాళ్లపై కీలక చర్యలు..

యూపీ వారియర్స్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్, కిరణ్ నవ్‌గిరే WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ జట్టు మ్యాచ్‌లో WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.

ఈ కారణంగా జరిమానా..

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో WPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు సోఫీ ఎక్లెస్టోన్, కిరణ్ నవ్‌గిరేలకు జరిమానా విధించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, సోఫీ, కిరణ్ ఇద్దరూ ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనను అంగీకరించారు. ఇది మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు లేదా మైదానంలోని పరికరాలను దుర్వినియోగానికి సంబంధించినది. దీని ప్రకారం, ప్రవర్తనా నియమావళి మొదటి స్థాయి ఉల్లంఘనపై మ్యాచ్ రిఫరీ నిర్ణయం అంతిమమైనది.

ఇవి కూడా చదవండి

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం..

ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ కావడంతో యూపీ వారియర్స్ ఉత్కంఠ విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ