Video: ఒకే వేదికపై ముగ్గురు వరల్డ్ కప్ విజేతలు.. స్పెషల్ ఎట్రాక్షన్ చూస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే..
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా ఎం. అంబానీ ముంబైలో ఏర్పాటు చేసిన 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' అనే వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ల సమక్షంలో జరిగిన ఈ వేడుక భారత క్రీడా చరిత్రలో ఒక అపురూప ఘట్టంగా నిలిచింది.

భారత క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా రిలయన్స్ ఫౌండేషన్ ‘యునైటెడ్ ఇన్ ట్రయంఫ్’ పేరుతో ముంబైలో ఒక భారీ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్-చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ముగ్గురు ప్రపంచ కప్ విజేత కెప్టెన్లతో కలిసి ఆమె రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
ఒకే వేదికపై ముగ్గురు కెప్టెన్లు..
ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్లైండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ దీపికా టీసీ పాల్గొన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు ఛాంపియన్ కెప్టెన్లు ఒకే వేదికపైకి రావడం విశేషం.
నీతా అంబానీ ప్రసంగం..
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “భారత పురుషుల క్రికెట్ జట్టు, మహిళల క్రికెట్ జట్టు, బ్లైండ్ క్రికెట్ జట్టు.. ఈ మూడు జట్లు ఈ రోజు ఇక్కడ ఒకే గూటి కిందకు రావడం సంతోషంగా ఉంది. మనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని అందించిన ఈ క్రీడాకారులను ప్రతి భారతీయుడి తరపున మేము ఈ రాత్రి గౌరవించుకోబోతున్నాము” అని ఆమె పేర్కొన్నారు.
క్రీడల పట్ల అంకితభావం..
#WATCH | Founder-Chairperson of Reliance Foundation, Nita M Ambani, graced the red carpet with the three World Cup winning captains – Rohit Sharma, Harmanpreet Kaur and Deepika TC at Reliance Foundation’s initiative, United in Triumph, in Mumbai yesterday.
She said, “All three… pic.twitter.com/XKy1iBbiLr
— ANI (@ANI) January 6, 2026
రిలయన్స్ ఫౌండేషన్ క్రీడలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది. కేవలం ప్రధాన స్రవంతి క్రీడలనే కాకుండా, బ్లైండ్ క్రికెట్ వంటి విభాగాల్లో రాణిస్తున్న వారిని కూడా గుర్తించి గౌరవించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకకు క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




