ఆనాడు వన్డేల్లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 పరుగులు బాదేశాడు.. ఎవరంటే?
13 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.. 3 సంవత్సరాల క్రితం తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో తుస్సుమనిపించాడు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో చోటు దక్కలేదంటే.. కచ్చితంగా ఆ ఆటగాడికి, కెప్టెన్ బాబర్ ఆజామ్ మధ్య విబేధాలు ఉన్నడటం వల్లే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అలాంటి ప్లేయర్ ఒకరి గురించి చెప్పబోతున్నాం. 13 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.. 3 సంవత్సరాల క్రితం తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో తుస్సుమనిపించాడు.. అతడెవరో కాదు పాక్ మాజీ వికెట్ కీపర్ ఉమర్ అక్మల్. తాజాగా జరుగుతోన్న పాకిస్థాన్ వన్డే కప్ టోర్నమెంట్‌లో ఉమర్ అక్మల్ విధ్వంసం సృష్టించాడు. ధోని అభిమాని అయిన షానవాజ్ దహానీ ఓవర్‌లో 25 పరుగులు కొల్లగొట్టడమే కాదు 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
పాకిస్థాన్ వన్డే కప్ మ్యాచ్‌లో షానవాజ్ దహానీ బౌలింగ్‌లో ఉమర్ అక్మల్ వీరబాదుడు బాదాడు. డిసెంబర్ 14న సింధ్, నార్తర్న్ మధ్య మ్యాచ్‌లో ఉమర్ తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని ఇచ్చాడు. సింధ్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఉమర్ అక్మల్ 58 బంతుల్లో 95 పరుగులతో చేశాడు. 162 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడిన అతడు తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. అలాగే షానవాజ్ దహానీ వేసిన ఒక్క ఓవర్లో 25 పరుగులు కొల్లగొట్టాడు. అయితే ఉమర్ అక్మల్ ఇంత చేసినా కూడా.. తన జట్టు నార్తర్న్‌ను మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
ఒక్క ఓవర్లో 25 పరుగులు..
షానవాజ్ దహానీ వేసిన 46వ ఓవర్ తొలి బంతికి ఉమర్ ఫోర్ కొట్టాడు. రెండో బంతి వైడ్ కాగా.. ఆ తర్వాత బంతికి అక్మల్ సిక్స్.. మూడో బంతికి కూడా సిక్స్ కొట్టి.. 4,5 బంతుల్లో వరుస ఫోర్లు బాదాడు. ఇక చివరి బంతికి సింగిల్ తీసి అక్మల్ మళ్లీ తన వద్దే స్ట్రైక్ ఉంచుకున్నాడు. తద్వారా ఈ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు రాబట్టాడు.ఈ మ్యాచ్‌లో సింధ్ జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది. నార్తర్న్ జట్టు నిర్దేశించిన 50 ఓవర్లలో కేవలం 298 పరుగులు మాత్రమే చేయగలిగింది.