AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అయ్యో పాపం.. ఇదేంది సామీ.. 2 సిక్సులు, 10 ఫోర్లతో బీభత్సం.. అయినా దక్కని విజయం.. ఎవరంటే?

The Hundred 2023: 196 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది, ట్రెంట్ రాకెట్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (15), డేవిడ్ మలాన్ (1) ఆరంభంలోనే వికెట్లను లొంగిపోయారు. ఈ దశలో 4వ ర్యాంక్‌తో మైదానంలోకి దిగిన జో రూట్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు.

Video: అయ్యో పాపం.. ఇదేంది సామీ.. 2 సిక్సులు, 10 ఫోర్లతో బీభత్సం.. అయినా దక్కని విజయం.. ఎవరంటే?
Joe Root Hits Blazing 72
Venkata Chari
|

Updated on: Aug 13, 2023 | 7:20 PM

Share

The Hundred 2023: ఇంగ్లండ్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్‌లో జో రూట్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో దృష్టిని ఆకర్షించాడు. లండన్ స్పిరిట్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది. తదనుగుణంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన లండన్ స్పిరిట్ జట్టుకు జాక్ క్రాలే అత్యద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన క్రాలీ కేవలం 15 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ డేనియల్ లారెన్స్ బ్యాటింగ్‌కు దిగాడు. క్రీజులోకి రాగానే దంచికొట్టడం ప్రారంభించిన లారెన్స్ ట్రెంట్.. రాకెట్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఇవి కూడా చదవండి

జోరూట్ ధనాధన్ ఇన్నింగ్స్..

49 బంతులు ఎదుర్కొన్న డేనియల్ లారెన్స్ 3 భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో లండన్‌ స్పిరిట్‌ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

196 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించిన ట్రెంట్ రాకెట్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (15), డేవిడ్ మలాన్ (1) ఆరంభంలోనే వికెట్లను లొంగిపోయారు. ఈ దశలో 4వ ర్యాంక్‌తో మైదానంలోకి దిగిన జో రూట్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు.

విజ్డన్ ట్వీట్..

తుఫాన్ బ్యాటింగ్‌తో రూట్ మైదానంలోని ప్రతి మూలకు బంతిని పంపించాడు. ఫలితంగా ట్రెంట్ రాకెట్స్‌కు చివరి 5 బంతుల్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది.

నాథన్ ఎల్లిస్ వేసిన చివరి 5 బంతుల్లో మొదటి బంతికి డేనియల్ సామ్స్ ఫోర్ కొట్టాడు. 2వ బంతికి సామ్స్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 3వ బంతికి గ్రెగొరీ 2 పరుగులు చేశాడు. 4వ బంతికి మరో రెండు పరుగులు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ గ్రెగొరీ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

డేవిడ్ భారీ సిక్స్..

దీంతో లండన్ స్పిరిట్ జట్టు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. జో రూట్ 35 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

లండన్ స్పిరిట్ ప్లేయింగ్ XI: డేనియల్ లారెన్స్ (కెప్టెన్), ఆడమ్ రోసింగ్టన్ (వికెట్ కీపర్), జాక్ క్రాలే, మాథ్యూ వేడ్, డారిల్ మిచెల్, రవి బొపారా, మాథ్యూ క్రిచ్లీ, క్రిస్ వుడ్, లియామ్ డాసన్, నాథన్ ఎల్లిస్, డేనియల్ వోరాల్.

జోరూట్ హాఫ్ సెంచరీ..

ట్రెంట్ రాకెట్స్ ప్లేయింగ్ 11: అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, కోలిన్ మున్రో, టామ్ కోహ్లర్-కాడ్మోర్ (వికెట్ కీపర్), జో రూట్, సామ్ హెయిన్, డేనియల్ సామ్స్, లూయిస్ గ్రెగొరీ (కెప్టెన్), ల్యూక్ వుడ్, సామ్ కుక్, ఇష్ సోధి.

జోరూట్ రీ ఎంట్రీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..