AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కరాచీ నుంచి ఊడిపడ్డారా ఏంది.. క్యాచ్ కోసం ముగ్గురు.. అయినా ఫసక్.. పాక్ ఫీల్డర్లను మించిపోయారుగా..

TNPL 2023 Catch Drop Video: తమిళనాడు ప్రీమియర్ లీగ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లు క్యాచ్‌ కోసం వచ్చి.. నేలపాలు చేశారు. ఈ క్యాచ్ డ్రాప్‌ని చూసిన అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ జట్టును గుర్తు చేసుకుంటున్నారు.

Video: కరాచీ నుంచి ఊడిపడ్డారా ఏంది.. క్యాచ్ కోసం ముగ్గురు.. అయినా ఫసక్.. పాక్ ఫీల్డర్లను మించిపోయారుగా..
Tnpl 2023 Catch Drop Video
Venkata Chari
|

Updated on: Jul 12, 2023 | 5:20 PM

Share

TNPL 2023 Catch Drop Video: ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో క్యాచ్ డ్రాప్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎందుకంటే, అచ్చం పాకిస్థాన్ ఫీల్డర్లను గుర్తు చేసినట్లుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టోర్నమెంట్‌లో రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ నెల్లై రాయల్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో నెల్లై రాయల్ కింగ్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఓ సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది.

ఈ క్యాచ్ వీడియో చూసిన తర్వాత, అభిమానులు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ 2008లో వెస్టిండీస్‌పై వదిలిన క్యాచ్‌ను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అజ్మల్‌ క్యాచ్‌ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉమర్ గుల్ వేసిన బంతికి క్రిస్ గేల్ షాట్ కొట్టడంతో బంతి గాలిలోకి వెళ్లింది. క్యాచ్ పట్టుకోవడానికి సాయేజ్ అజ్మల్‌తో పాటు షోయబ్ మాలిక్ కూడా చేరుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడ్డారు. కానీ, ఎవరూ బంతిని అందుకోలేదు. అలాగే ఇటీవల కూడా పాకిస్తాన్ ఫీల్డర్లు బౌండరీ లైన్‌లో క్యాచ్ కోసం పోటీ పడి మరీ విఫలమయ్యారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఇదే ఘటన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా తెరపైకి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన సుబోత్ భాటి దిండిగల్ డ్రాగన్స్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికి షాట్ ఆడగా, బంతి వికెట్ కీపర్ వెనుక గాలిలోకి వెళ్లింది. వికెట్ కీపర్‌తో సహా ముగ్గురు ఆటగాళ్ళు క్యాచ్ పట్టుకోవడానికి పరిగెత్తారు. కానీ, ముగ్గురూ క్యాచ్ కోసం చేతులు చాచలేదు. బంతి ముగ్గురి మధ్యలో పడిపోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

క్యాచ్ డ్రాప్ వీడియో..

నెల్లై రాయల్ కింగ్స్, దిండిగల్ డ్రాగన్స్ మధ్య జరిగిన ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డ్రాగన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఆ జట్టు తరపున శివమ్ సింగ్ 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల ఛేదనకు వచ్చిన నెల్లై రాయల్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు తరపున అజితేష్ గురుస్వామి 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ