WI vs IND Playing 11: టాస్ గెలిచిన వెస్టిండీస్.. వరుసగా 9వ సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన.. జైస్వాల్, ఇషాన్ అరంగేట్రం..
West Indies vs India, 1st Test: రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేటి నుంచి మొదలైంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ముందుగా బౌలింగ్ చేయనుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో టీమిండియా నేటి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేటి నుంచి మొదలైంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ముందుగా బౌలింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ టెస్టు అరంగేట్రం చేశారు. నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు టెస్టుల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2019లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. గత 21 ఏళ్లుగా కరీబియన్ జట్టు టెస్టుల్లో టీమిండియాను ఓడించలేకపోయింది. 2002 మే 18న కింగ్‌స్టన్‌లో భారత్‌పై జట్టు చివరి విజయం సాధించింది. ఈ సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకోగలిగితే, వెస్టిండీస్‌పై టీమిండియాకు వరుసగా 9వ సిరీస్ విజయం అవుతుంది.
భారతపై వెస్టిండీస్ ఆధిపత్యం..
కరేబియన్ జట్టు పటిష్టంగా ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల పర్ఫార్మెన్స్ దీనికి విరుద్ధంగా ఉంది. భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు మొత్తం 24 టెస్టు సిరీస్‌లు జరిగాయి. భారత్ 10, వెస్టిండీస్ 12 సిరీస్‌లు గెలుచుకోగా, 2 సిరీస్‌లు డ్రా అయ్యాయి. టీమిండియా ఇప్పటివరకు వెస్టిండీస్‌లో 12 టెస్టు సిరీస్‌లు ఆడగా, 5 గెలిచి, 7 ఓడింది.
అదే సమయంలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 98 టెస్టులు జరిగాయి. ఇందులో భారత్ 22, వెస్టిండీస్ 30 మ్యాచ్‌లు గెలిచాయి. 46 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2002 నుంచి ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 టెస్టులు జరగ్గా, భారత్ 15, వెస్టిండీస్ 2 మాత్రమే గెలిచాయి. అక్టోబర్ 2002 తర్వాత విండీస్ ఒక్క విజయం కూడా అందుకోలేదు. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
Congratulations to Yashasvi Jaiswal and Ishan Kishan who are all set to make their Test debut for #TeamIndia.
Go well, lads!#WIvIND pic.twitter.com/h2lIvgU6Zp
— BCCI (@BCCI) July 12, 2023
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
వెస్డిండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్ నరైన్ చందర్‌పాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (కీపర్), జాసన్ హోల్డర్, రహ్కీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..