AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనో భయస్తుడు.. బంతిని చూస్తేనే వణుకు.. వెంటనే జట్టు నుంచి తీసేయండి..

Krishnamachari Srikkanth: వరుసగా రెండు టీ20 సిరీస్ పరాజయాలను నివారించాలంటే భారత జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిన జీవన్మరణ సమస్య ఏర్పడింది. ఇంగ్లండ్ పేసర్ల పదునైన బంతులను ఎదుర్కొని భారత బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఏది

అతనో భయస్తుడు.. బంతిని చూస్తేనే వణుకు.. వెంటనే జట్టు నుంచి తీసేయండి..
Krishnamachari Srikkanth Comments On Tilak Varma
Venkata Chari
|

Updated on: Jul 11, 2026 | 12:30 PM

Share

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో దారుణమైన ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న టీమిండియాపై మాజీ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును తీవ్రంగా తప్పుపట్టాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేక అతడు వణికిపోతున్నాడని, వెంటనే తుది జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశాడు.

కుప్పకూలిన పేకమేడ.. నాటింగ్‌హామ్‌లో దారుణం..

ఇంగ్లండ్ గడ్డపై భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలుతోంది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇంగ్లండ్ లో భారత పురుషుల టీ20 జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కలిపి గత నాలుగు టీ20 మ్యాచ్‌లలోనూ భారత జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే భారత మాజీ ఓపెనర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జట్టు కూర్పుపై, ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!

ఇవి కూడా చదవండి

అతనో భయస్తుడు.. క్రీజులో ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు!

తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై శ్రీకాంత్ మండిపడ్డాడు. “అతన్ని ఇప్పటికే వైస్ కెప్టెన్‌ను చేశారు, బహుశా త్వరలో కెప్టెన్‌ను కూడా చేస్తారేమో. ఇంగ్లండ్ పిచ్‌లపై పేస్, బౌన్స్‌ను చూసి అతడికి వణుకు పుడుతోంది. షార్ట్ పిచ్ బంతులను ఎలా ఎదుర్కోవాలో తిలక్ వర్మకు అసలు ఏమాత్రం అవగాహన లేదు” అని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా శ్రీకాంత్ దుయ్యబట్టాడు.

జట్టుకు ప్రధాన బ్యాటర్‌గా ఉండి కూడా ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడని, అందుకే అతడిని కాపాడేందుకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపుతున్నారని విమర్శించాడు. అతన్ని ఎప్పుడో జట్టు నుంచి తీసేయాలని తాను పదే పదే చెబుతున్నా, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు. మూడో టీ20లో 11 బంతులు ఆడిన తిలక్ వర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

తిలక్ వర్మ కంటే సంజూ శాంసన్‌ను ఆడించండి..

ఈ నేపథ్యంలో తిలక్ వర్మ కంటే సంజూ శాంసన్‌ను తుది జట్టులో ఆడించడం వంద శాతం మేలని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా మూడుసార్లు విఫలమవడంతో శాంసన్‌ను పక్కనపెట్టి, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి యాజమాన్యం అవకాశం ఇచ్చింది. అయితే సూర్యవంశీ కూడా ఇంగ్లీష్ పేసర్ల ముందు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, తదుపరి మ్యాచ్‌లలో సంజూ శాంసన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

వరుసగా రెండు టీ20 సిరీస్ పరాజయాలను నివారించాలంటే భారత జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిన జీవన్మరణ సమస్య ఏర్పడింది. ఇంగ్లండ్ పేసర్ల పదునైన బంతులను ఎదుర్కొని భారత బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు క్రీజులో బాధ్యతారాహిత్యంగా ఆడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే బ్యాటింగ్ విభాగం తమ తప్పులను వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us