టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ఓపెనింగ్ చేసేది వీరేనంట: ప్రకటించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హగ్!
T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ 2021 అక్టోబరు-నవంబర్ మధ్యలో యూఏఈ వేదికగా మొదలుకానుంది. కరోనా కారణంతో భారత్ నుంచి యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే.
T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కి వేదిక ఖరారైన సంగతి తెలిసిందే. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ కరోనా కారణంగా.. యూఏఈ తరలించింది బీసీసీఐ. ఈ మేరకు ఐసీసీకి వివరాలను తెలియజేసింది. అయితే తాజాగా దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెటర్ టీ20లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేశాడు. బ్రాడ్ హగ్ ఎంపిక చేసిన టీమిండియాలో.. రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించాడు. అలాగే శిఖర్ ధావన్‌ను ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్ లో చేర్చాడు. దానికి ఓ కారణం కూడా వెల్లడించాడు బ్రాడ్ హగ్. టీమిండియాకు మిడిలార్డర్‌లో అటాకింగ్ చేసేందుకు ఓ ప్లేయర్ అవసరమని, అందుకే శిఖర్ ధావన్ మిడిలార్డర్‌లో రావడం చాలా మంచిదని పేర్కొన్నాడు.
అలాగే విరాట్ ప్లేస్‌ను సూర్యకుమార్ యాదవ్‌కు ఇచ్చాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను కూడా మిడిలార్డర్‌లో చేర్చాడు. దాంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా తయారవుతుందని వెల్లడించారు. హార్థిక్, జడేజాలు ఆల్ రౌండర్ల బాధ్యతలను నెరవేరుస్తారని పేర్కొన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. హాగ్ ప్రకటించిన జట్టులో ముగ్గురు స్పెషలిస్టులైన ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌ను ఎంపిక చేశాడు. శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాతోపాటు చాహల్‌ను బౌలింగ్‌లో చేర్చాడు.
మరోవైపు, అక్టోబరు 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 పురుషుల వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లో యూఏఈ, ఒమన్‌లో జరగనున్నాయి. రౌండ్-1లో 12 మ్యాచ్‌లు ఉండగా, ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వీటిలో నాలుగు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పాపువా న్యూ గినియా జట్ల నుంచి నాలుగు సూపర్ 12కు చేరుతాయి. తర్వాత టాప్ 8 తో కలిసి 30 మ్యాచ్‌లు జరగనున్నాయి. రౌండ్-2 సూపర్ 12 అక్టోబర్ 24 నుంచి మొదలు కానుంది. సూపర్ 12లో మ్యాచులు యుఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలోని మూడు వేదికలలో జరగనున్నాయి. అనంతరం మూడు ప్లేఆఫ్, రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.
Also Read:
India vs England: ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ ఫాం చాలా కీలకం: టీమిండియా మాజీ క్రికెటర్ రితేందర్
8 ఓవర్లలో 10 వికెట్లు డౌన్.. అంతా కలిపి సాధించిన స్కోర్ చూస్తే షాకవ్వాల్సిందే..!