Team India: పాకిస్థాన్‌లో ‘గూగుల్’ సెర్చ్.. నంబర్ వన్‌గా టీమిండియా ప్లేయర్.. ఎవరో తెలుసా?
Rewind 2025: టాప్-10 జాబితాలో అందరూ క్రికెటర్లే ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ప్రజలు తమ సొంత ఆటగాళ్ల కంటే ఓ భారత ఆటగాడి గురించే తెలుసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో అగ్రస్థానంలో మనోడే నిలిచాడు. పాక్ ఆటగాడు సయిమ్ అయూబ్ ఆరో స్థానంలో నిలిచాడు.

Team India: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సరిహద్దులు దాటి దాయాది దేశం పాకిస్థాన్‌లో కూడా సంచలనం సృష్టించాడు. 2025 సంవత్సరానికి గానూ గూగుల్ విడుదల చేసిన ‘ఇయర్ ఇన్ సెర్చ్’ (Year in Search) నివేదికలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్‌లో నెం.1 అథ్లెట్‌గా అభిషేక్..
పాకిస్థాన్‌లో 2025 సంవత్సరంలో అత్యధికంగా గూగుల్‌లో శోధించబడిన అథ్లెట్ (Most Searched Athlete)గా భారత ఓపెనర్ అభిషేక్ శర్మ నిలిచారు. ఇది నిజంగా ఒక సంచలనంగా మారింది.
స్థానిక దిగ్గజాలు వెనక్కి నెట్టి..:
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం, షాహీన్ షా ఆఫ్రిదీ, మహమ్మద్ రిజ్వాన్ వంటి వారు కూడా ఈ జాబితాలో అభిషేక్ శర్మ కంటే వెనుకబడిపోయారు. ఆశ్చర్యకరంగా, బాబర్, షాహీన్ వంటి వారు టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
ఒకే ఒక్కడు:
టాప్-10 జాబితాలో అందరూ క్రికెటర్లే ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ప్రజలు తమ సొంత ఆటగాళ్ల కంటే భారత ఆటగాడైన అభిషేక్ శర్మ గురించి తెలుసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. పాక్ ఆటగాడు సయిమ్ అయూబ్ ఆరో స్థానంలో నిలిచాడు.
కారణం ఏమిటి?
అభిషేక్ శర్మకు పాకిస్థాన్‌లో ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణాలు:
విధ్వంసకర బ్యాటింగ్..
అభిషేక్ శర్మ ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఏకంగా 101 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఆయన దూకుడు చూసి పాక్ అభిమానులు ఫిదా అయ్యారు.
పాకిస్థాన్‌పై ప్రదర్శన..
ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ చెలరేగి ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఆయన చూపిన ఆధిపత్యం అక్కడి నెటిజన్లను ఆకర్షించింది.
భారత్‌లో ఎవరు టాప్?
మరోవైపు, భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన క్రీడాకారుడిగా 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తన చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరచడంతో భారతీయలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు.
మొత్తానికి, మైదానంలో పరుగుల వరద పారిస్తున్న అభిషేక్ శర్మ, ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లోనూ రికార్డుల మోత మోగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఒక భారతీయ క్రికెటర్ నెం.1 స్థానంలో నిలవడం నిజంగా విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








