IND vs SA: సౌతాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టు.. తొమ్మిదిమందికి గంభీర్, ఆరుగురికి అగార్కర్ అండదండలు
India vs South Africa T20I Series: ఇటీవలే వన్డే సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గంభీర్ వ్యూహాలు, అగార్కర్ ఎంపికలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.

India vs South Africa T20I Series: దక్షిణాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు టీ20 సిరీస్ మొదలుకానుంది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిరీస్‌ను దక్కించుకుంది. ఇక డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టులో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇద్దరి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.
గౌతమ్ గంభీర్ మద్దతు ఉన్న 9 మంది ఆటగాళ్లు..
టీమిండియా టీ20 జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ తనదైన శైలిని ప్రదర్శించారు. ఆయన ఎక్కువగా మద్దతు ఇస్తున్న 9 మంది ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌ను టీ20ల్లో ఓపెనర్‌గా పంపడం వెనుక గంభీర్ పాత్ర కీలకం.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, శివమ్ దూబే, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్‌కు గంభీర్ మద్దతు ఉంది.
అజిత్ అగార్కర్ ఎంపిక చేసిన 6గురు ప్లేయర్లు..
మరోవైపు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎప్పటిలాగే మ్యాచ్ విన్నర్ల వైపు మొగ్గు చూపారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న 6గురు స్టార్ ఆటగాళ్లను ఆయన ఎంపిక చేశారు.
తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు అజిత్ అగార్కర్ మద్దతు ఉంది.
సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టు (Squad):
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
సంజూ శాంసన్ (వికెట్ కీపర్)
తిలక్ వర్మ
అభిషేక్ శర్మ
హార్దిక్ పాండ్యా
శివమ్ దూబే
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
జస్ప్రీత్ బుమ్రా
అర్ష్‌దీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా.
ఇటీవలే వన్డే సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గంభీర్ వ్యూహాలు, అగార్కర్ ఎంపికలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








