AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రోహిత్ ఎఫెక్ట్‌తో కోహ్లీ జాన్ జిగిరీ దోస్త్ కెరీర్ క్లోజ్.. సడన్ రిటైర్మెంట్‌తో షాక్.. ఎవరంటే?

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే, టీ20 క్రికెట్ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లోనూ సత్తా చాటాడు. అయితే, టెస్ట్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సమయంలో.. విరాట్ కోహ్లీ ఫ్రెండ్ రిటైర్మెంట్ చేయక తప్పలేదు.

Team India: రోహిత్ ఎఫెక్ట్‌తో కోహ్లీ జాన్ జిగిరీ దోస్త్ కెరీర్ క్లోజ్.. సడన్ రిటైర్మెంట్‌తో షాక్.. ఎవరంటే?
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jul 14, 2025 | 8:55 PM

Share

రోహిత్ శర్మ టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం అతను భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ పేరు మీద అనేక భారీ బ్యాటింగ్ రికార్డులు ఉన్నాయి. గతంలో, రోహిత్ శర్మను వన్డే, టీ20 క్రికెట్‌లో మాత్రమే మంచి బ్యాట్స్‌మన్‌గా భావించేవారు. కానీ, తరువాత రోహిత్ శర్మ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలోనూ గొప్పతనాన్ని సాధించాడు. రోహిత్ శర్మ టెస్ట్ ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సమయంలో ఒక బ్యాట్స్‌మన్ కెరీర్ పూర్తిగా నాశనమైందంట.

రోహిత్ ఎఫెక్ట్‌తో కెరీర్‌ను ముగించిన ప్లేయర్ ఎవరంటే?

రోహిత్ శర్మ రాకతో చాలామంది ఓపెనర్లు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఆటగాళ్లలో ఒకరు లెజెండరీ ఓపెనర్ మురళీ విజయ్. చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న మురళీ విజయ్ జనవరి 2023లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. మురళీ విజయ్ ఒకప్పుడు టీమ్ ఇండియాలో అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్‌గా పేరుగాంచాడు. కానీ, ఇప్పుడు అతను చాలా సంవత్సరాలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మురళీ విజయ్ డిసెంబర్ 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

విరాట్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్..

మురళీ విజయ్ టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 3982 పరుగులు చేశాడు. ఇది మాత్రమే కాదు, అతని బ్యాట్ నుంచి 12 సెంచరీలు కూడా వచ్చాయి. అతనికి వన్డే, టీ20 క్రికెట్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పుడు, మురళీ విజయ్ నిరంతరం టీం ఇండియా తరపున ఓపెనింగ్ బాధ్యతను పోషించాడు. ఈ ఆటగాడు సంవత్సరాలుగా ఈ బాధ్యతను నిర్వహించాడు. కానీ, ఆ తర్వాత రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌ను వదిలి టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత మురళీ విజయ్ కెరీర్ పతనం ప్రారంభమైంది. దీంతోరిటైర్మైంట్ చేయక తప్పలేదు.

రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్..

రోహిత్ శర్మ భారత జట్టు తరపున 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరు 212 పరుగులు. రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం, అతను భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..