IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. తొలిసారి స్వ్కాడ్‌లో చేరిన టీ20 తుఫాన్ బ్యాటర్స్..
Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

Team India Squad: ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. మొదటి రెండు టెస్టులకు మాత్రమే బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు టీమిండియా – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి అశ్విన్ , అక్షర్ పటేల్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.




తొలిసారి టెస్టు జట్టులోకి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్..
భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా తొలిసారిగా టెస్టు జట్టులోకి వచ్చారు. ఇషాన్ కిషన్ గతంలో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ నిరంతరం తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ గతేడాది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 3 సార్లు సెంచరీ మార్కును దాటాడు.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
India’s squad for first 2 Tests vs Australia: Rohit Sharma (C), KL Rahul (vc), Shubman Gill, C Pujara, V Kohli, S Iyer, KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, Axar Patel, Kuldeep Yadav, Ravindra Jadeja, Mohd. Shami, Mohd. Siraj, Umesh Yadav, Jaydev Unadkat, Suryakumar Yadav
— BCCI (@BCCI) January 13, 2023
భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9-13 వరకు, రెండో టెస్టు ఫిబ్రవరి 17-21 వరకు, మూడో టెస్టు మార్చి 1-5 వరకు, నాలుగో టెస్టు మార్చి 9-13 వరకు జరుగుతాయి. ఆ తర్వాత తొలి వన్డే మార్చి 17న, రెండో వన్డే మార్చి 19న, మూడో వన్డే మార్చి 22న జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




