India Squad: ఇంగ్లండ్ టూర్‌కి భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ప్రిన్స్.. తెలుగోడికి లక్కీ ఛాన్స్
Team India: ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఈ పర్యటన జూన్ 2025లో ప్రారంభమవుతుంది. ఇక్కడ రెండు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సిరీస్ 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా ఉంటుంది.

Team India: వచ్చే నెలలో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఇందులో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత భారత జట్టుకు ఇది కొత్త ప్రారంభం. దీంతో భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ కూడా దొరికాడు.
ఇంగ్లాండ్ టూర్ కు భారత జట్టు ప్రకటన..
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ పర్యటనకు యువ టీం ఇండియాను ఎంపిక చేసింది. యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ బ్యాటింగ్ బాధ్యతను స్వీకరించవచ్చు. కోహ్లీ లేకపోవడంతో మిడిలార్డర్‌లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లకు స్థానం లభించింది. వీరు నంబర్ 4 పాత్రను పోషించగలరు. రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అతను వికెట్ కీపింగ్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ధ్రువ్ జురెల్ రెండవ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025
అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈసారి టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. అతను టెస్ట్ జట్టులో భాగం కావడం ఇదే తొలిసారి. వీరితో పాటు శార్దుల్ ఠాకూర్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి రావడంలో విజయవంతమయ్యాడు. కానీ, ఈ 18 మంది ఆటగాళ్లలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని చేర్చలేదు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ జట్టులో భాగం కాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఎంపికయ్యారు.
WTC 2025-27 సైకిల్‌లో భాగంగా టీమిండియా షెడ్యూల్..!
రాబోయే రెండేళ్ల కాలంలో భారత జట్టు 18 టెస్టులు ఆడాల్సి ఉంది.
1. ఇంగ్లాండ్‌లో భారత పర్యటన – 5 టెస్టులు – జూన్-ఆగస్టు 2025
2. వెస్టిండీస్ భారత పర్యటన – 2 టెస్టులు – అక్టోబర్ 2025
3. దక్షిణాఫ్రికా భారత పర్యటన – 2 టెస్టులు – నవంబర్-డిసెంబర్ 2025
4. శ్రీలంకలో భారత పర్యటన – 2 టెస్టులు – జూన్ 2026
5. న్యూజిలాండ్‌లో భారత పర్యటన – 2 టెస్టులు – అక్టోబర్-నవంబర్ 2026
6. ఆస్ట్రేలియా భారత పర్యటన – 5 టెస్టులు – జనవరి-ఫిబ్రవరి 2027.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








