AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 5th Test: 3 టెస్ట్‌లు 63 పరుగులు.. వైఫల్యాకు కేరాఫ్ అడ్రస్‌గా కోహ్లీ ఫ్రెండ్.. అయినా, 5వ టెస్ట్‌లో ఛాన్స్.. ఎందుకంటే?

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రజత్ పాటిదార్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 32, 9, 5, 0, 17, 0 పరుగులు చేశాడు. రాంచీ టెస్టులో రజత్ విఫలమైనప్పటి నుంచి జట్టులో స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఇక్కడ పాటిదార్‌కు కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత్ సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యంలో సాధించడమే. దీంతో పాటిదార్ విఫలం పెద్దగా చర్చల్లోకి రాలేదు.

IND vs ENG 5th Test: 3 టెస్ట్‌లు 63 పరుగులు.. వైఫల్యాకు కేరాఫ్ అడ్రస్‌గా కోహ్లీ ఫ్రెండ్.. అయినా, 5వ టెస్ట్‌లో ఛాన్స్.. ఎందుకంటే?
rajat patidar ind vs eng 5th test
Venkata Chari
|

Updated on: Mar 03, 2024 | 11:38 AM

Share

IND vs ENG 5th Test: మార్చి 7 నుంచి ధర్మశాలలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, చివరి టెస్టు జరగనుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా ఈ టెస్టులో ఆడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయింగ్ 11ని ఎంచుకోవడం రోహిత్ శర్మకు సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చిన రజత్ పాటిదార్ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పాటిదార్‌కు ధర్మశాలలో మరో అవకాశం వస్తుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్న టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు తలనొప్పిలా మారింది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రజత్ పాటిదార్ విఫలమయ్యాడు. ఇదిలావుండగా, ధర్మశాల టెస్టులో టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి అవకాశం ఇవ్వవచ్చు అని వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్ చివరి టెస్టులో రజత్ పాటీదార్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అంటే దేవదత్ పడిక్కల్ తన టెస్టు అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ రజత్ విఫలం..

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రజత్ పాటిదార్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 32, 9, 5, 0, 17, 0 పరుగులు చేశాడు. రాంచీ టెస్టులో రజత్ విఫలమైనప్పటి నుంచి జట్టులో స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఇక్కడ పాటిదార్‌కు కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత్ సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యంలో సాధించడమే. దీంతో పాటిదార్ విఫలం పెద్దగా చర్చల్లోకి రాలేదు.

ఇవి కూడా చదవండి

ధర్మశాల టెస్ట్‌లో రజత్‌కి చివరి అవకాశం..

“పాటీదార్‌కు ప్రతిభ ఉందని భావిస్తున్నందున జట్టు మరో అవకాశం పొందాలని కోరుకుంటుంది. ఇది సమయం మాత్రమే, అతను ఎప్పుడైనా పరుగులు చేయగలడు. భారతదేశం ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి, జట్టు దేవదత్ పడిక్కల్‌కు అరంగేట్రం కాకుండా రజత్‌ను మరో ప్రయత్నం చేయాలని కోరుకుంటోందిస” అని బీసీసీఐ మూలాలు తెలిపినట్లు వినిపిస్తోంది.

విరాట్ కోహ్లీ స్థానంలో 30 ఏళ్ల రజత్ పాటిదార్‌ను టెస్టు జట్టులోకి తీసుకున్నారు. కుటుంబ కారణాలతో కోహ్లీ విరామం తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయపడటంతో వైజాగ్ టెస్టులో రజత్ అరంగేట్రం చేశాడు. రాహుల్ గాయం నుంచి కోలుకుని 5వ టెస్టుకు అందుబాటులో ఉండి ఉంటే, పాటీదార్ విడుదలై విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో తన సొంత జట్టు మధ్యప్రదేశ్ తరపున ఆడగలిగేవాడు. కానీ, అలా జరగలేదు. అయితే, భారత జట్టు శనివారం చండీగఢ్‌కు చేరుకుని, ఇక్కడి నుంచి ధర్మశాలకు వెళ్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..