వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో టీమిండియా దూసుకపోతోంది. శనివారం అమెరికాలోని లాడర్‌హిల్‌లో జరగనున్న నాలుగో టీ20 ఇరుజట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యాన్ని అందుకుంటుంది. అయితే, ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అతని బ్యాట్ హిట్టింగ్ చేస్తే, ప్రపంచ నంబర్ వన్ T20 బ్యాట్స్‌మన్ అవుతాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను రెండోస్థానానికి పడేస్తాడు. సూర్యకుమార్ నంబర్ వన్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
సూర్యకుమార్ నంబర్ వన్ బ్యాటర్..
బాబర్ ఆజం 818 పాయింట్లతో టీ20లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. గత ఏడాది కాలంగా ఈ పదవిలో కొనసాగుతున్న పాక్ సారథి.. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ దెబ్బకు తన కుర్చీని వదిలేయాల్సి వస్తుంది. ఈ ఆటగాడు బాబర్ కంటే కేవలం 2 రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. నాలుగో టీ20లో పాక్ కెప్టెన్‌ను సూర్యకుమార్ యాదవ్ అధిగమించే ఛాన్స్ ఉంది. దీని కోసం, సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒక భారీ ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుంది. అంటే సూర్యకుమార్ 30-40 పరుగులు చేసి జట్టు గెలిస్తే, అతను ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్‌మన్ అవుతాడు. ఒకవేళ సూర్యకుమార్ హాఫ్ సెంచరీ కొట్టినట్లయితే, బాబర్ రెండోస్థానానికి పడిపోయినట్లే. నాలుగో టీ20లో సూర్యకుమార్ ఫ్లాప్ అయినా.. ఐదో టీ20లో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. అంటే సూర్యకుమార్ నంబర్ 1గా నిలిచేందుకు రెండు అవకాశాలు ఉన్నాయి.
ICC ర్యాంకింగ్స్ ఎలా నిర్ణయిస్తారు?