INDW vs ENGW, CWG 2022: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఉత్కంఠ విజయంతో ఫైనల్‌కు.. కామన్వెల్త్‌లో పతకం పక్కా..

తొలి ప్రయత్నంలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుని, ఓ పతకాన్ని కూడా ఖాయం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

INDW vs ENGW, CWG 2022: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఉత్కంఠ విజయంతో ఫైనల్‌కు.. కామన్వెల్త్‌లో పతకం పక్కా..
Indw Vs Engw, Cwg 2022
Follow us

|

Updated on: Aug 06, 2022 | 7:39 PM

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా మహిళల క్రికెట్‌ను చేర్చిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుని, ఓ పతకాన్ని కూడా ఖాయం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన 32 బంతుల్లో 61 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో 44 పరుగులు చేసి, ఆకట్టుకున్నారు.

దీంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగుల వద్దే ఆగిపోయింది. దీప్తి శర్మ తన బౌలింగ్‌లో సోఫియా డంక్లీ ని(19) ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసింది. ఎల్లీస్ కెప్సే (13) రనౌట్ అయింది. స్నేహ రాణా బౌలింగ్‌లో డేనియల్ వ్యాట్ (35) ఔటైంది. 40 పరుగుల వద్ద కెప్టెన్ నేట్ షివర్ రనౌట్‌గా వెనుదిరిగింది.

ఇవి కూడా చదవండి

మంధాన, షెఫాలీ తొలి వికెట్‌కు తుఫాను భాగస్వామ్యంతో భారత జట్టుకు వేగవంతమైన ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 7.5 ఓవర్లలో 76 పరుగులు జోడించారు. షెఫాలీ వికెట్‌‌ను ఫ్రెయా క్యాంప్ పడగొట్టింది. నటాలీ స్కివర్ మంధానకు పెవిలియన్‌కు దారి చూపింది. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. భారత్ 13 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ అయింది. జెమీమా కూడా ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత వేగం పెంచగలిగింది. దీప్తి శర్మ 20 బంతుల్లో 22 పరుగులు చేసింది.

రెండు జట్లు..

భారత ప్లేయింగ్ XI : షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI : డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఎల్లీస్ కెప్సే, నటాలీ షివర్ (సి), అమీ జోన్స్ (వాకింగ్), మైయా బౌచర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టన్, ఫ్రెయా కెంప్, ఇజ్జీ వాంగ్, సారా గ్లెన్.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!