AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: రోహిత్ ఫాన్స్‌‌కు గుడ్‌న్యూస్.. మ్యాచ్‌కి సిద్ధమైన హిట్‌మ్యాన్.. ఎప్పుడంటే?

India vs Australia: ఇండియా A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియా A తరపున ఆడనున్నట్లు సమాచారం. అలాగే, ఈ సిరీస్ తర్వాత హిట్‌మ్యాన్ భారత సీనియర్ జట్టులో చేరనున్నాడు.

IND vs AUS: రోహిత్ ఫాన్స్‌‌కు గుడ్‌న్యూస్.. మ్యాచ్‌కి సిద్ధమైన హిట్‌మ్యాన్.. ఎప్పుడంటే?
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Aug 23, 2025 | 6:27 PM

Share

India vs Australia: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియా A తరపున ఆడే అవకాశం ఉంది. రెవ్‌స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియా పర్యటనకు సన్నాహాల్లో భాగంగా సెప్టెంబర్-అక్టోబర్‌లో జరగనున్న ఇండియా A వర్సెస్ ఆస్ట్రేలియా A మధ్య జరిగే వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఆడనున్నాడు.

ఎందుకంటే, భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు . ఐపీఎల్ తర్వాత అతను ఏ మ్యాచ్‌లోనూ కనిపించలేదు.

ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ తర్వాత, టీం ఇండియా ఆస్ట్రేలియాతో ఏకైక సిరీస్‌కు వెళుతుంది. దానికి ముందు రోహిత్ శర్మ ఒక పోటీ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం, సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరిగే సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఇండియా A జట్టులో చేరాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

భారత జట్టు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 ఐలు ఉంటాయి. ఈ సిరీస్‌కు ముందు , ఇండియా ఎ ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడుతుంది. రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ శిక్షణ ప్రారంభం..

రాబోయే సిరీస్ కోసం రోహిత్ శర్మ ఫిట్‌నెస్ శిక్షణ ప్రారంభించాడు. హిట్‌మ్యాన్ మాజీ టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి జిమ్‌లో చెమటలు పట్టడం ప్రారంభించాడు. తద్వారా ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. మంచి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ద్వారా 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతానని రోహిత్ శర్మ కూడా నమ్మకంగా ఉన్నాడు.

భారత్, ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్..

అక్టోబర్ 19: మొదటి వన్డే – పెర్త్ స్టేడియం, పెర్త్

అక్టోబర్ 23: రెండో వన్డే – అడిలైడ్ ఓవల్

అక్టోబర్ 25: మూడో వన్డే – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ

అక్టోబర్ 29: మొదటి టీ20ఐ మ్యాచ్ – మనుకా ఓవల్, కాన్‌బెర్రా

అక్టోబర్ 31: రెండవ టీ20ఐ మ్యాచ్- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్

నవంబర్ 2: మూడో టీ20ఐ మ్యాచ్ – బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

నవంబర్ 6: నాల్గవ టీ20ఐ మ్యాచ్ – గోల్డ్ కోస్ట్ స్టేడియం, కర్రారా

నవంబర్ 8: ఐదవ టీ20ఐ మ్యాచ్ – ది గబ్బా, బ్రిస్బేన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..