AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VHT 2023: వామ్మో.. ఇదేం బౌలింగ్ భయ్యా.. 9 ఓవర్లలో 3 మెయిడీన్లు, 9 పరుగులు.. 5 వికెట్లతో బ్యాటర్లకు చుక్కలు..

Vijay Hazare Trophy 2023: వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 మెయిడిన్లతో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరోవైపు సాయికిషోర్ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హ్మీద్ రెహమాన్ (1)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేయగా, అకావి యెప్టో (3) ఇంద్రజిత్‌కి క్యాచ్ ఇచ్చాడు. 10వ ర్యాంక్ లో వచ్చిన క్రివిట్సో.. కెన్స్ (0)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీని ద్వారా నాగాలాండ్ జట్టును 19.4 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌట్ చేయడంలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు.

VHT 2023: వామ్మో.. ఇదేం బౌలింగ్ భయ్యా.. 9 ఓవర్లలో 3 మెయిడీన్లు, 9 పరుగులు.. 5 వికెట్లతో బ్యాటర్లకు చుక్కలు..
Varun Chakravarthy
Venkata Chari
|

Updated on: Dec 06, 2023 | 11:27 AM

Share

Varun Chakravarthy: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న విజయ్ హజారే టోర్నీ రౌండ్-7 మ్యాచ్‌లో తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాగాలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు కెప్టెన్ దినేష్ కార్తీక్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టుకు శుభారంభం లభించలేదు. షామ్‌వాంగ్ వాంగ్నావో (1) వికెట్ వెంటనే కోల్పోయింది. నటరాజన్ తమిళనాడు జట్టుకు తొలి విజయాన్ని అందించగా, సందీప్ వారియర్ 2వ వికెట్ తీసుకున్నాడు.

9వ ఓవర్ తొలి బంతికే ఓరెన్ నగుల్లి (1)ని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. 13వ ఓవర్ చివరి బంతికి హెచ్ జిమోమీ కూడా మిస్టరీ స్పిన్‌కు బలయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తహ్మీద్ రెహమాన్ (1)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేయగా, అకావి యెప్టో (3) ఇంద్రజిత్‌కి క్యాచ్ ఇచ్చాడు. 10వ ర్యాంక్ లో వచ్చిన క్రివిట్సో.. కెన్స్ (0)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీని ద్వారా నాగాలాండ్ జట్టును 19.4 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌట్ చేయడంలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు.

వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 మెయిడిన్లతో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరోవైపు సాయికిషోర్ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

70 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన తమిళనాడు జట్టు 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

నాగాలాండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాషువా ఒజుకుమ్, షామ్‌వాంగ్ వాంగ్నావో, ఒరెన్ న్‌గుల్లి, సుమిత్ కుమార్ (వికెట్ కీపర్), రోంగ్‌సెన్ జొనాథన్ (కెప్టెన్), హొకైటో జిమోమి, తహ్మీద్ రెహమాన్, చోపిస్ హోపాంగ్‌క్యూ, అకావి యెప్టో, క్రివిట్సో కెన్సెత్యా.

తమిళనాడు ప్లేయింగ్ ఎలెవన్: సాయి సుదర్శన్, ఎన్ జగదీశన్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్ (కెప్టెన్), షారూఖ్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టి నటరాజన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్