AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh Iyer: బంతి తగిలి మైదానంలో కుప్పకూలిన టీమిండియా యంగ్ ప్లేయర్‌.. తాజా హెల్త్‌ అప్డేట్ ఏంటంటే?

Duleep Trophy-2022: టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. కోయంబత్తూర్‌ వేదికగా జరుగుతోన్న దులీప్‌ ట్రోఫీలో సెంట్రల్‌ జోన్‌ జట్టుకు ఆడుతున్న వెంకటేశ్‌ బంతి తగిలి మైదానంలోనే పడిపోయాడు.

Venkatesh Iyer: బంతి తగిలి మైదానంలో కుప్పకూలిన టీమిండియా యంగ్ ప్లేయర్‌.. తాజా హెల్త్‌ అప్డేట్ ఏంటంటే?
Venkatesh Iyer
Basha Shek
|

Updated on: Sep 17, 2022 | 6:56 AM

Share

Duleep Trophy-2022: టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. కోయంబత్తూర్‌ వేదికగా జరుగుతోన్న దులీప్‌ ట్రోఫీలో సెంట్రల్‌ జోన్‌ జట్టుకు ఆడుతున్న వెంకటేశ్‌ బంతి తగిలి మైదానంలోనే పడిపోయాడు. అయ్యర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. వెస్ట్‌జోన్‌ బౌలర్‌ చింతన్‌ గజా వేసిన బంతిని బౌలర్‌ దిశగా డిఫెన్స్‌ ఆడాడు. అంతకుముందు బాల్‌ను సిక్స్‌గా మలచడంతో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న గజా వెంటనే బంతిని వెంకటేశ్‌ మీదకు విసిరాడు. అది నేరుగా అయ్యర్‌ మెడకు తాకింది. దీంతో బాధతో మైదానంలోనే విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వెంకటేశ్‌ను పరీక్షించాడు. ఈనేపథ్యంలో ముందుకు జాగ్రత్త చర్యగా అంబులెన్స్‌ను కూడా మైదానంలోకి తీసుకొచ్చారు. అయితే అయ్యర్‌ మాత్రం మెల్లగా నడుస్తూనే డ్రెస్సింగ్‌ రూంకు చేరుకున్నాడు. అనంతరం అంబులెన్స్‌లో కావేరీ ఆస్పత్రికి తరలించారు.

కాగా వెంకటేశ్‌ అయ్యర్‌ గాయంపై హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చింది. అయ్యర్‌ ఆరోగ్యంగా ఉన్నాడని, వైద్యులు పరీక్షించి అతనిని డిశ్చార్జ్‌ చేశారని తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది . కాగా మ్యాచ్‌లో రిటైర్‌ హార్ట్‌గా వెనుదిరిగిన అయ్యర్‌ తిరిగి మళ్లీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే 14 పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ సంఘటనను గుర్తుకు తెచ్చిందంటూ క్రికెట్ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుడి గంట శబ్దం వల్ల నిజంగా ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన నిజం
గుడి గంట శబ్దం వల్ల నిజంగా ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన నిజం
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి