KL Rahul: ఉదారత చాటుకున్న కేఎల్ రాహుల్.. బాలుడి శస్త్రచికిత్స కోసం రూ. 31 లక్షల సహాయం..
Ind vs Sl: శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్‌ల కోసం కేఎల్ రాహుల్ భారత జట్టులో భాగం కాలేదు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ స్నాయువు గాయంతో బాధపడ్డాడు
KL Rahul: టీమిండియా(Team India) ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఉదారతను చాటుకున్నాడు. అరుదైన రక్త వ్యాధితో పోరాడుతున్న వరద్ నల్వాడే అనే బాలుడికి అత్యవసరంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) అవసరమైంది. దీంతో కేఎల్ రాహుల్ అతనికి సహాయం చేశాడు. 11 ఏళ్ల వరద్ శస్త్రచికిత్సకు అవసరమైన రూ. 35 లక్షల్లో రాహుల్ రూ.31 లక్షలు విరాళంగా అందించి ఆదుకున్నాడు. డిసెంబర్‌లో, వరద్ తల్లిదండ్రులు సచిన్ నల్వాడే, స్వప్నా ఝా తమ కుమారుడి చికిత్స కోసం గివ్‌ఇండియా అనే NGO ద్వారా రూ. 35 లక్షలు సేకరించేందుకు ప్రచారాన్ని గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించారు.
ఐదవ తరగతి చదువుతోన్న ఈ బాలుడు అనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్ట్ సంరక్షణలో ఉన్నాడు. వరద్ రక్తంలో ప్లేట్‌లెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అతని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడలేకపోయింది. సాధారణ జ్వరం వచ్చినా కోలుకోవడానికి నెలల సమయం పట్టేది. వరద్ పరిస్థితికి శాశ్వత నివారణ బోన్ మారో సర్జరీ చేయాలని తేల్చారు.
వైద్యం కోసం పీఎఫ్ డబ్బులు.. ఈ మధ్యతరగతి కుటుంబానికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులేకుండా పోయింది. తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను సజీవంగా ఉంచేందుకు చికిత్సలో తన పీఎఫ్ డబ్బు కూడా ఉపయోగించాడు. వరత్ 11వ పుట్టినరోజు కోసం ఒక ఫ్యాన్సీ క్రికెట్ బ్యాట్‌ని కూడా కొనిచ్చాడు. క్రికెటర్‌గా మారాలనే అతని ఆశలను సజీవంగా ఉంచుచేందుకు కష్టపడుతున్నాడు.
త్వరగా కోలుకుని, తన కలను సాకారం చేసుకోవాలి.. ఈ విరాళం గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, ‘వరద్ పరిస్థితి గురించి తెలుసుకున్నప్పుడు, మా బృందం గివ్‌ఇండియాను సంప్రదించింది. తద్వారా మేం అతనికి ఏ విధంగానైనా సహాయం చేయాలనుకున్నాం. సర్జరీ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉంది. వరద్ వీలైనంత త్వరగా కోలుకొని, తన కలలను సాధించేందుకు ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. నా సహకారం మరింత మంది ముందుకు రావడానికి, అవసరమైన వారికి సహాయం చేయడానికి స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని రాహుల్ తెలిపాడు.
వరద్ భారత్ తరఫున ఆడాలనుకుంటున్నాడు.. వరద్ తల్లి స్వప్న మాట్లాడుతూ, ‘వరద్ శస్త్రచికిత్స కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినందుకు కేఎల్ రాహుల్‌కు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత తక్కువ సమయంలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అసాధ్యం. కానీ, రాహుల్ సహాయంతో అది నేరవేరింది’ అని పేర్కొంది. తమను కాపాడేందుకు భారత ఆటగాడు వస్తాడని వరద్ కుటుంబం కూడా ఊహించలేదు. భవిష్యత్తులో భారత్ తరఫున ఆడడం గురించి వరద్ తరచుగా మాట్లాడుతుంటాడు. తన ప్రాణాలను కాపాడిన ఆటగాడిని అనుసరించే అవకాశం అతనికి ఈ రూపంలో లభించింది.
Also Read: IND vs SL: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో దూరమైన స్టార్ ఆల్ రౌండర్..
IND vs SL, 1st T20I: టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. సీనియర్ల రాకతో వీరు బెంచ్‌కే పరిమితం?