భయపడొద్దు.. ధైర్యంగా పేరు చెప్పండి బ్రదర్: సాహాకు సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్
Indian Cricket Team: ఇంటర్వ్యూ కోసం తనను బెదిరించిన జర్నలిస్టు పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టబోనని సాహా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
భారత టెస్టు జట్టు (Indian Cricket Team)లో చోటు దక్కకపోవడంతో వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) పలు విషయాలు వెల్లడించాడు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలతో జరిగిన సంభాషణను బహిరంగంగా బయటపెట్టాడు. దీని తర్వాత ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటూ బెదిరించిన స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నాడు. ఈ మేరకు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag) కూడా ప్రస్తుతం సాహాకు ఒక సలహా ఇచ్చాడు. తనను బెదిరించిన జర్నలిస్ట్ పేరును వెల్లడించాలని కోరాడు.
ఆ జర్నలిస్టు పేరును ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకురాబోనని సాహా ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకుముందు, బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, ఈ విషయంలో బోర్డు సాహాను ప్రశ్నిస్తుందని, విషయం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.
పేరు చెప్పండి.. జర్నలిస్టు పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టనని.. హాని చేయలేనని సాహా చేసిన ప్రకటనపై సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కానీ, భవిష్యత్తులో అలాంటి హాని నుంచి మరొకరిని రక్షించడానికి, మీరు పేరును వెల్లడించడం మంచింది. ఊపిరి పీల్చుకుని పేరు చెప్పండి” అంటూ సలహా ఇచ్చాడు.
సాహా ట్వీట్‌లో ఏముందంటే? సాహా తన ట్వీట్‌లో ఇలా రాశాడు, “కెరీర్ ముగిసేంతవరకు ఎవరికీ హాని కలిగించడం నా స్వభావం కాదు. మనిషిగా, అతని కుటుంబాన్ని చూస్తూ ఇలా చేయడం తప్పుడ. నేను ఇప్పుడే పేరును వెల్లడించను. కానీ అది మళ్లీ జరిగితే మాత్రం నేను ఆగను” అంటూ రాసుకొచ్చాడు.
Dear Wriddhi, it’s not your nature to harm others and you are a wonderful guy. But to prevent such harm from happening to anyone else in the future , it’s important for you to name him. Gehri saans le, aur naam bol daal. https://t.co/9ovEUT8Fbm
— Virender Sehwag (@virendersehwag) February 22, 2022
Also Read: KL Rahul: ఉదారత చాటుకున్న కేఎల్ రాహుల్.. బాలుడి శస్త్రచికిత్స కోసం రూ. 31 లక్షల సహాయం..
IND vs SL: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో దూరమైన స్టార్ ఆల్ రౌండర్..