IND vs SL: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో దూరమైన స్టార్ ఆల్ రౌండర్..

శ్రీలంకతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. లక్నోలో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

IND vs SL: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో దూరమైన స్టార్ ఆల్ రౌండర్..
Deepak Chahar, Ind Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Feb 22, 2022 | 7:35 PM

Deepak Chahar, IND Vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టు(Team India)కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టీ20 సిరీస్‌కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దీపక్ గాయపడిన విషయం తెలిసిందే. దీపక్ చాహర్ కుడి తొడలో నొప్పి తీవ్రంగా ఉండడంతో శ్రీలంక(Sri Lanka) సిరీస్‌కు దూరమయ్యాడని తెలుస్తోంది. గాయం కారనంగా టీమ్ ఇండియా బయో-బబుల్‌ను విడిచిపెట్టాడని సమాచారం. దీపక్ చాహర్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడు. అక్కడ అతను 5-6 వారాల పాటు పునరావాసంలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గాయం ఎప్పుడు తగిలింది? కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో T20 మ్యాచ్‌లో, దీపక్ చాహర్ కండరాల ఒత్తిడికి గురయ్యాడు. దాని కారణంగా అతను తన ఓవర్‌ని కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ మ్యాచ్ మొత్తం నుంచి ఔట్ అయ్యాడు.

ప్రస్తుతం అతను నేరుగా ఐపీఎల్‌లో కనిపించగలడని నమ్ముతున్నారు. దీపక్ చాహర్‌ను ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. దీపక్ గతంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.

టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిహమ్ బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్

భారత్ వర్సెస్ శ్రీలంక షెడ్యూల్..

ఫిబ్రవరి 24 – తొలి టీ20, లక్నో

ఫిబ్రవరి 26 – 2వ టీ20, ధర్మశాల

ఫిబ్రవరి 27 – 3వ టీ20, ధర్మశాల

మార్చి 4-8 – తొలి టెస్టు, మొహాలీ

మార్చి 12-16 – 2వ టెస్టు, బెంగళూరు (డే-నైట్)

Also Read: IPL 2022: ఫ్రాంచైజీలకు భారీ షాక్.. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు.. రంగంలోకి దిగిన బీసీసీఐ..!

IND vs SL, 1st T20I: టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. సీనియర్ల రాకతో వీరు బెంచ్‌కే పరిమితం?