IND vs SL, 1st T20I: టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. సీనియర్ల రాకతో వీరు బెంచ్‌కే పరిమితం?

భారతదేశం-శ్రీలంక టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. ప్లేయింగ్ XIలో రెండు కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.

IND vs SL, 1st T20I:  టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. సీనియర్ల రాకతో వీరు బెంచ్‌కే పరిమితం?
India Vs Sri Lanka, 1st T20
Follow us

|

Updated on: Feb 22, 2022 | 5:49 PM

ఫిబ్రవరి 24 నుంచి భారత్ -శ్రీలంక మధ్య టీ20 సిరీస్ (India vs Sri Lanka, 1st T20) ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ లక్నోలో జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించనున్నారు. టీ20 సిరీస్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja), జస్ప్రీత్ బుమ్రాలకు జట్టులో చోటు లభించడంతో వారి ప్లేస్ ఖరారైనట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా రవీంద్ర జడేజా క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నందున.. తొలి టీ20లో అందరి దృష్టి రవీంద్ర జడేజాపైనే ఉంటుంది. జడేజా గాయపడినా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. జడేజా ఫిట్‌గా ఉన్నాడు అంటే ప్లేయింగ్ XIలో అతనిని చేర్చడం దాదాపు ఖాయమైనట్లే. అయితే, జడేజా ప్లేయింగ్ XIలోకి తిరిగి వస్తే, ఎవరి స్థానంలో జట్టులోకి వస్తాడనేది పెద్ద ప్రశ్నగా మారింది.

రవీంద్ర జడేజాను జట్టులో ఉంచేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నిజానికి, జడేజా గైర్హాజరీలో వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లను ఆల్‌రౌండర్‌లుగా ప్రయత్నించారు. ముగ్గురూ మంచి ప్రదర్శన చేశారు. జడేజా గైర్హాజరీతో టీమ్ ఇండియా గత సిరీస్‌లో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వీరిలో యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఉన్నారు. కాబట్టి జడేజా పునరాగమనం తర్వాత జట్టులో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను మాత్రమే ఉంచుతారా.. లేదో.. తెలియాల్సి ఉంది. ఎందుకంటే జడ్డూ స్వతహాగా గొప్ప స్పిన్ బౌలర్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

రవి బిష్ణోయ్‌పై వేటు పడొచ్చు..! జడేజా పునరాగమనంతో రవి బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతని అనుభవానికి జట్టు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఓపెనింగ్ బరిలో ఎవరు? శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది కూడా కీలకంగా మారింది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో, రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌లో దిగగా, ఇషాన్ కిషన్-రీతురాజ్ జోడి ఓపెనింగ్‌ బరిలో నిలిచింది. శ్రీలంకపై కూడా ఇలాగే జరగొచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ మరోమారు నంబర్ 3 లేదా 4లో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. మరి టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

IND vs SL, తొలి టీ20ఐ కోసం ప్రాబబుల్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా

Also Read: NZ Vs IND: 26 బంతుల్లో హాఫ్ సెంచరీ.. కివీస్‌లో భారత వికెట్ కీపర్ తుఫాన్ ఇన్నింగ్స్‌.. 14 ఏళ్ల నాటి రికార్డులకు బ్రేకులు..

IND vs SL T20I Series: లంకతో భారత్ తలపడితే.. రన్స్ 200 దాటాల్సిందే.. ఇరుజట్లు చేసిన 5 భారీ స్కోర్‌లు ఇవే..!