Champions Trophy: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. అత్యంత చెత్త రికార్డ్ నెలకొల్పిన టీమిండియా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. గిల్, రోహిత్, కోహ్లీ తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు సాధించి చెత్త రికార్డును సృష్టించింది. న్యూజిలాండ్ గెలిచినట్లయితే సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఓడినట్లయితే ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీని అవుట్ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా ఈ రోజు(మార్చ్ 2, ఆదివారం) న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెమీస్ చేరినప్పటికీ ఇది నామమాత్రపు మ్యాచ్ అయితే కాదు. సెమీస్‌లో ఏ జట్టుతో టీమిండియా మ్యాచ్ ఆడాలో ఈ మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. సెమీస్‌లో మన ప్రత్యర్థి ఆస్ట్రేలియానా? సౌతాఫ్రికానా? అనేది న్యూజిలాండ్‌పై గెలుపొటములపై ఆధారపడి ఉంది. గెలిస్తే ఆస్ట్రేలియాతో, ఓడితే సౌతాఫ్రికాతో టీమిండియా సెమీస్‌లో తలపడనుంది. ఇంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే న్యూజిలాండ్ భారీ ఎదురుదెబ్బ కొట్టింది.
కేవలం 30 పరుగులకే ముగ్గురు స్టార్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు కివీస్ బౌలర్లు. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మతో పాటు గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లీ సైతం తక్కువ స్కోర్‌కే అవుటై తీవ్రంగా నిరాశపర్చారు. గిల్ 2, రోహిత్ 15, కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇలా టాపార్డర్ కుప్పకూలడంతో టీమిండియా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అదేంటంటే.. పవర్ ప్లేలో అతి తక్కువ స్కోర్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ముందుగా బ్యాటింగ్ చేస్తూ.. 1-10 ఓవర్ల మధ్య ఇదే టీమిండియా అత్యల్ప స్కోరు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి 10 ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేసింది. అందులో 3 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు కాస్త స్వింగ్ లభిస్తుండటంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అప్పటికీ రోహిత్ శర్మ ఒక ఫోర్, సిక్స్, కోహ్లీ రెండు ఫోర్లు బాదినప్పటికీ.. అంతే వేగంగా ఆడే క్రమంలో ఇద్దరూ అవుట్ అయ్యారు. గిల్ దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక సూపర్‌మ్యాన్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో కూడా అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. విరాట్ కోహ్లీ ఆడిన కట్ షాట్‌ను సూపర్‌గా అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి విరాట్ కోహ్లీ కూడా షాక్ అయ్యాడు.
Satisfying cricket video, best catch in champions trophy 2025 🔥 #INDvsNZ pic.twitter.com/TIb11tGLpp
— Prayag (@theprayagtiwari) March 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
