IND vs WI: అదృష్టాన్ని మార్చిన వెస్టిండీస్ పర్యటన.. జట్టులోకి ఎంట్రీతోనే 3 ఫార్మాట్లతో అరంగేట్రం..
India vs West Indies 4th T20I: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ లాడర్‌హిల్ క్రికెట్ గ్రౌండ్‌లో రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. 5 టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో ముందంజలో ఉంది. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న భారత్ సిరీస్‌లో నిలవాలంటే ఈరోజు జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
India vs West Indies 4th T20I: టీమిండియా ఆటగాడిపై భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఈ ఆటగాడు ఇప్పటివరకు విజయవంతమయ్యాడు. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఈ ఆటగాడు టీమ్ ఇండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఈ టూర్ ఈ ఆటగాడికి చాలా ప్రత్యేకమైనది. ఈ ఆటగాడు తన అరంగేట్రం మూడు ఫార్మాట్లలో ఒకదాని తర్వాత ఒకటిగా ఆడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్‌పై భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసలు కురిపించాడు. ముకేశ్ కుమార్ మూడు ఫార్మాట్లలో భారత్‌కు ఆడే సామర్థ్యాన్ని కనబరిచాడు. వెస్టిండీస్ పర్యటనలో, ఈ ఫాస్ట్ బౌలర్‌కు మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఫ్లోరిడాలో నాల్గవ టీ20 ఇంటర్నేషనల్‌కు ముందు, ముఖేష్ పురోగతిపై మాంబ్రే సంతృప్తి వ్యక్తం చేశాడు.
భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాట్లాడుతూ, ‘అతను అభివృద్ధి చెందుతున్న తీరుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతని ఆలోచన, అతనితో మేం జరిపిన చర్చలు, ఆట పట్ల అతని వైఖరి చాలా అద్భుతంగా ఉన్నాయి. టూర్‌లో ఇక్కడికి వచ్చిన, విభిన్న వికెట్లపై కఠినమైన ప్రత్యర్థి జట్లతో ఆడడం అంత సులభం కాదు. కానీ, అతను బౌలింగ్ చేసిన విధానం, అతను చూపిన స్ఫూర్తితో మేం చాలా సంతోషంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
నేడు కీలక పోరు..
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ లాడర్‌హిల్ క్రికెట్ గ్రౌండ్‌లో రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. 5 టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో ముందంజలో ఉంది. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న భారత్ సిరీస్‌లో నిలవాలంటే ఈరోజు జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి.