- Telugu News Photo Gallery Cricket photos Tilak varma may surpass virat kohli t20i record in next two t20i matches against west indies
IND vs WI: కింగ్ కోహ్లీ రికార్డులపై కన్నేసిన టీమిండియా నయా సెన్సెషన్.. అలా జరిగితే తెలుగబ్బాయిదే అగ్రస్థానం..
Tilak Varma: ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో తిలక్ 69.50 సగటు, 139.00 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో మరో 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న T20 సిరీస్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో తిలక్ 69.50 సగటు, 139.00 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు.
Updated on: Aug 10, 2023 | 2:52 PM

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఆగస్టు 8న జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను సజీవంగా ఉంచుకుంది. జట్టు తరపున సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 83 పరుగులు చేయగా, బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.

వీరిద్దరూ కాకుండా తిలక్ వర్మ కీలకమైన అజేయ ఇన్నింగ్స్ ఆడి, టీమ్ ఇండియా విజేతగా నిలిచాడు. యువ బ్యాట్స్‌మెన్ 37 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న T20 సిరీస్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో తిలక్ 69.50 సగటు, 139.00 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో మరో 2 మ్యాచ్‌లు మిగిలి ఉండగా ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును తిలకించే అవకాశం ఉంది.

టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుతో సహా అనేక రికార్డులను కలిగి ఉన్నాడు. మార్చి 2021లో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో కోహ్లి మూడు అజేయ అర్ధశతకాలు సాధించాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై 231 పరుగులు చేశాడు. దీంతో పాటు ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక T20I సిరీస్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇతర ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ రెండవ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ 224 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 206 పరుగులు చేసిన యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

న్యూజిలాండ్‌పై 153 పరుగులు చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడుతున్న తిలక్ వర్మ ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే కేవలం 92 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం తిలక్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 139 పరుగులు చేశాడు.





























