Ravindra Jadeja: సీఎస్కే పోస్టులన్నింటినీ డిలీట్ చేసిన జడ్డూ.. కారణం అదేనంటోన్న ఫ్యాన్స్..
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను తాజాగా ఆ జట్టుకు సంబంధించిన అన్ని రకాల పోస్టులను తొలగించాడు. దీంతో ..

Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను తాజాగా ఆ జట్టుకు సంబంధించిన అన్ని రకాల పోస్టులను తొలగించాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఐపీఎల్-2022కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్ ధోని (MS DHoni) తప్పుకోవడంతో కొత్త సారథిగా జడేజా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే చెన్నై వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఆటగాడిగానూ జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జడ్డూ టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ ధోనికే ఆ బాధ్యతలను అప్పగించాడు. అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తం నుంచి తప్పించుకున్నాడు.
కాగా ఇదే సమయంలో చెన్నై యాజమాన్యమే కెప్టెన్సీ నుంచి జడేజాను తొలగించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అదేవిధంగా వచ్చే ఏడాది సీజన్‌కు ముందే సీఎస్కేకు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో జడేజా సీఎస్కే పోస్టులు డిలీట్ చేయడం.. ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఇక గాయం నుంచి కోలుకున్న జడేజా తిరిగి ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్టుకు భారత జట్టులో చేరాడు. ఈ టెస్టులో జడేజా అద్బుతమైన సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ సిరీస్ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గాను ఎంపికయ్యాడు.




మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
