ఇటు సోషల్ మీడియా.. అటు క్రికెట్‌లోనూ తగ్గేదేలే అంటోన్న స్టార్ ప్లేయర్.. ఎవరో గుర్తుపడితే మీరు గ్రేటే..

ఆయనో ప్రముఖ క్రికెటర్. అది కూడా టీమిండియాలో దుమ్మురేపుతోన్న ప్లేయర్ కూడా. అటు సోషల్ మీడియాలో, ఇటు క్రికెట్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను..

ఇటు సోషల్ మీడియా.. అటు క్రికెట్‌లోనూ తగ్గేదేలే అంటోన్న స్టార్ ప్లేయర్.. ఎవరో గుర్తుపడితే మీరు గ్రేటే..
Indian Cricketer
Follow us
Venkata Chari

|

Updated on: Mar 11, 2022 | 6:50 PM

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీదీ తెగ వైరలవుతుంటుంది(Viral). ఇక వారు షేర్ చేసే ఫొటోలు, వీడియోల గురించి చెప్పనక్కర్లేదు. నెట్టింట్లో అగ్రస్థానం సెలబ్రిటీలదే. తాజాగా ఓ సెలబ్రిటీ చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే, ఈ ఫొటో సినీ రంగానికి చెందినది మాత్రం కాదండోయ్. ఆయనో ప్రముఖ క్రికెటర్. అది కూడా టీమిండియా(Team India)లో దుమ్మురేపుతోన్న యంగ్ ప్లేయర్ కూడా. అటు సోషల్ మీడియాలో, ఇటు క్రికెట్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తన బౌలింగ్, బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలను ఇమేటేట్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ఈ మధ్య పుష్ప(Pushpa) సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్‌తోపాటు, శ్రీవల్లీ స్టెప్పులను తనదైన స్టైల్‌లో అనుకరించి ఆకట్టుకున్నాడు. మరి ఇంతకి ఎవరో గుర్తుకువచ్చిందా..

ఈ బాలుడు ఎవరో కాదండోయ్.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja). అవునండీ, ఈ బుడతడి చిన్ననాటి ఫొటోనే ఇది. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో అదరగొట్టిన ‘సర్ జడేజా’.. నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాడు. ఈమేరకు అభిమానులు తన చిన్ననాటి ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ కం స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్.. టీమిండియాతోపాటు ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటుతూ దూసుకపోతున్నాడు. ఫస్ట్ క్లాస్, రంజీ, అండర్-19లో రాణించడంతో 20 ఏళ్లకే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర వన్డేలో 60 నాటౌట్‌తో రాణించాడు. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Ravindra Jadeja

Also Read: Pink Ball Test: పింక్ బాల్ టెస్ట్‌లో ఆ జట్టుదే ఆధిపత్యం.. తొలి విజయంతోపాటు సెంచరీ ఎప్పుడు నమోదైందంటే?

IND vs SL: అనిల్ కుంబ్లే రికార్డుపై కన్నేసిన అశ్విన్.. బెంగళూరు టెస్టులో మరో 7 వికెట్లు తీస్తే..