Watch Video: ఈ బుడ్డోడి బ్యాటింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. క్రికెట్ గాడ్ నుంచి లక్కీ ఆఫర్.. అదేంటో తెలుసా?

Sachin Tendulkar: కోల్‌కతా కుర్రాడి వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. వార్న్, టెండూల్కర్ వంటి దిగ్గజాల దృష్టిని కూడా ఈ చిన్నోడు ఆకర్షించాడు. చివరకు సచిన్ దగ్గరే క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని పొందాడు.

Watch Video: ఈ బుడ్డోడి బ్యాటింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. క్రికెట్ గాడ్ నుంచి లక్కీ ఆఫర్.. అదేంటో తెలుసా?
Sachin
Follow us
Venkata Chari

|

Updated on: Mar 11, 2022 | 7:27 PM

సోషల్ మీడియా పుణ్యామాని గత కొన్నేళ్లుగా చాలా మంది ప్రతిభావంతులు ప్రపంచం ముందు వచ్చే అవకాశాన్ని పొందారు. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఆదరణపొందుతన్నారు. వీరిలో క్రీడాకారుల గురించి మాట్లాడితే, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇటీవలి కోల్‌కతాకు చెందిన 5 ఏళ్ల ఎస్‌కే షాహిద్(SK Shahid Batting Viral video) చక్కని ఉదాహరణగా చూపవచ్చు. అతని బ్యాటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షేన్ వార్న్(Shane Warne) లాంటి అనుభవజ్ఞులు కూడా అతనిని పొగడటం మొదలుపెట్టాడు. దీంతో అతని కోరిక కూడా నెరవేరింది. షాహిద్ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్‌(Sachin Tendulkar)ను కలిసే అవకాశం మాత్రమే కాకుండా, అతనితో ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కూడా పొందాడు.

షాహిద్ వైరల్ వీడియో కూడా టెండూల్కర్ దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోతోనే షాహిద్ కల కొద్ది రోజుల్లోనే నెరవేరింది. ముంబైలో నడుస్తున్న టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ నుంచి షాహిద్‌కు కాల్ వచ్చింది. కానాయిజర్ కోచ్‌ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దక్కింది. విషయం ఇక్కడితో ముగియలేదు. ఈ అకాడమీలో ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, షాహిద్ కూడా సచిన్ టెండూల్కర్ దగ్గరే బ్యాటింగ్ ట్రిక్స్ నేర్చుకున్నాడు. షాహిద్, అతని కుటుంబం ముంబై పర్యటనకు అయ్యే ఖర్చు మొత్తాన్ని టెండూల్కర్ భరించాడు.

సచిన్‌ను కలవాలన్న కలకు మోక్షం..

షాహిద్ తండ్రి కోల్‌కతాలో హెయిర్ సెలూన్ నడుపుతున్నాడు. తన ఐదేళ్ల కుమారుడికి ఈ అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. వార్తా సంస్థ పీటీఐతో షేక్ షంషేర్ మాట్లాడుతూ, “నా కొడుకుకు ఐదేళ్లు. అతని ఆరాధ్యదైవం సచిన్ సర్. అతనిని కలవాలనేది మావాడి కల. అతను క్రికెటర్‌గా మారాలనుకుంటున్నాడు. సచిన్ సార్ చేసిన దానికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు.

వార్న్ కూడా అభిమానిగా మారిపోయాడు..

గత సంవత్సరం ఈ బుడ్డోడికి చెందిన ఓ వీడియోను ట్విట్టర్‌లో అతని తండ్రి పోస్ట్ చేశాడు. అందులో షాహిద్ షాట్లు చాలా మంది అనుభవజ్ఞుల దృష్టిని ఆకర్షించాయి. వారిలో దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఉన్నారు. డిసెంబర్ 2021లో, వార్న్ షాహిద్ గురించి ఓ ట్వీట్ కూడా చేశాడు. కేవలం 3 నెలల్లోనే, సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్ నుంచి షాహిద్ నేర్చుకునే అవకాశాన్ని పొందాడు. అయితే వార్న్ దానిని చూడలేకపోయాడు.

ఈ విషయమై షంషేర్ మాట్లాడుతూ, “మేం మా ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియోను అప్‌లోడ్ చేశాం. దీనిని ఆస్ట్రేలియా ఛానెల్ ఫాక్స్ స్పోర్ట్స్ కూడా ట్వీట్ చేసింది. టెండూల్కర్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, దివంగత షేన్ వార్న్‌లను ట్యాగ్ చేసింది. టెండూల్కర్ ఆ వీడియోను చూశారు” అని పేర్కొన్నాడు.

Also Read: ఇటు సోషల్ మీడియా.. అటు క్రికెట్‌లోనూ తగ్గేదేలే అంటోన్న స్టార్ ప్లేయర్.. ఎవరో గుర్తుపడితే మీరు గ్రేటే..

Pink Ball Test: పింక్ బాల్ టెస్ట్‌లో ఆ జట్టుదే ఆధిపత్యం.. తొలి విజయంతోపాటు సెంచరీ ఎప్పుడు నమోదైందంటే?