- Telugu News Photo Gallery Cricket photos IND vs SL: Team India Spinner Ashwin may break most wicket vs Sri Lanka in international cricket Anil kumble
IND vs SL: అనిల్ కుంబ్లే రికార్డుపై కన్నేసిన అశ్విన్.. బెంగళూరు టెస్టులో మరో 7 వికెట్లు తీస్తే..
మొహాలీలో కపిల్ దేవ్ రికార్డును సమం చేసిన అశ్విన్.. ప్రస్తుతం బెంగళూరులో అనిల్ కుంబ్లే రికార్డుపై పడింది. ఈ స్పెషల్ రికార్డుకు..
Updated on: Mar 11, 2022 | 4:33 PM

మొహాలీలో కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్.. ప్రస్తుతం బెంగళూరులో అనిల్ కుంబ్లే రికార్డుపై పడింది. ఈ స్పెషల్ రికార్డుకు రోహిత్ శర్మ 400వ అంతర్జాతీయ మ్యాచ్ సాక్షిగా నిలవనుంది. కుంబ్లే ఏ రికార్డును అశ్విన్ బ్రేక్ చేయనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

మొహాలీలో శ్రీలంకపై 100 అంతర్జాతీయ వికెట్ల మార్క్‌ను దాటిన అశ్విన్, ప్రస్తుతం బెంగళూరులో వికెట్ల రేసులో కుంబ్లేను ఓడించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకపై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన ప్రపంచంలోని 6వ, భారత బౌలర్లలో 3వ వాడిగా అశ్విన్ నిలవనున్నాడు.

అనిల్ కుంబ్లే శ్రీలంకపై అంతర్జాతీయంగా 108 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ప్రస్తుతం శ్రీలంకపై 101 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగుళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లను కలిపి అశ్విన్ 7 వికెట్లు తీస్తే.. కుంబ్లేను వెనక్కునెట్టనున్నాడు.

బెంగళూరు టెస్టు పింక్ బాల్‌తో జరగనుంది. అశ్విన్ పింక్ బాల్‌తో ఆడిన 3 టెస్టుల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్టులో అశ్విన్ భారత్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

శ్రీలంకపై అత్యధికంగా 155 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆటగాడిగా పాకిస్థాన్ ఆటగాడు వసీం అక్రమ్ రికార్డు సృష్టించాడు. అదే సమయంలో, హర్భజన్ సింగ్ 114 వికెట్లతో భారతీయులలో మొదటి స్థానంలో ఉన్నాడు.




