AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: హార్దిక్ సారథ్యంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఎందుకో తెలుసా?

భారత్-ఇంగ్లండ్ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ముగిస్తే తొలి టీ20లో రోహిత్, విరాట్, బుమ్రా, షమీ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే దీని అంచనాలు తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.

IND vs ENG: హార్దిక్ సారథ్యంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఎందుకో తెలుసా?
Hardik Pandya
Venkata Chari
|

Updated on: Jun 22, 2022 | 9:46 AM

Share

టీమ్ ఇండియాలో ప్రయోగాల కాలం ఐర్లాండ్ పర్యటన వరకు మాత్రమే ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో భారతదేశం దాదాపు అదే జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్‌ ఉండడంతో, అదే టీంతో ఇంగ్లండ్‌లో ఆడడం కష్టంగా మారనుంది. ఎందుకంటే, ఆటగాళ్లను బాగా పరీక్షించేందుకు కూడా ఇదే మంచి సమయంగా బీసీసీఐ భావిస్తుంది. అప్పుడే ఆటగాళ్ల సామర్థ్యాలు బయటకు వస్తాయని అనుకుంటోంది. చాలా టైట్ షెడ్యూల్ కారణంగా, ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భారత్ ప్రయోగాన్ని కొనసాగించాల్సి రావచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే, ఐర్లాండ్‌లాగే హార్దిక్ పాండ్యా అక్కడ కూడా కెప్టెన్‌గా వ్యవహరించడం చూడొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందో ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం లేదు.

టెస్ట్ మ్యాచ్ జులై 5న ముగుస్తుంది..

భారత ప్రధాన జట్టు జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు పూర్తి అయిదు రోజుల పాటు సాగితే.. రోహిత్ సహా టెస్టు జట్టులోని ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఆడడం కష్టమే. ఎందుకంటే తొలి టీ20 మ్యాచ్ జులై 7న మొదలు కానుంది. ఈ పరిస్థితిలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించేది ఒక్కరోజే కావడంతో, హార్ధిక్‌ తొలి టీ20కి సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఐర్లాండ్ తర్వాత ఇంగ్లండ్ వెళ్లాలని హార్దిక్ జట్టును బీసీసీ కోరింది. భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న సమయంలో, హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇంగ్లండ్ స్థానిక జట్లతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

ఇవి కూడా చదవండి

టెస్టు త్వరగా ముగిస్తే ప్లాన్ మారే ఛాన్స్..

భారత్-ఇంగ్లండ్ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ముగిస్తే తొలి టీ20లో రోహిత్, విరాట్, బుమ్రా, షమీ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే దీని అంచనాలు తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇంకా అధికారికంగా జట్టును ప్రకటించక పోవడం గమనార్హం.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!