AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎక్కడ ఆపాడో, అక్కడే మొదలెట్టాడు.. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సెంచరీతో ఇచ్చిపడేసిన పోటుగాడు

England Lions vs India A: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత, భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే క్రమంలో కరుణ్ నాయర్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి ఫామ్ జట్టుకు ఎంతో కీలకం. గతంలో ఇంగ్లాండ్‌పైనే ట్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత కరుణ్ నాయర్‌కు ఉంది.

Video: ఎక్కడ ఆపాడో, అక్కడే మొదలెట్టాడు.. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సెంచరీతో ఇచ్చిపడేసిన పోటుగాడు
Karun Nair
Venkata Chari
|

Updated on: May 31, 2025 | 9:30 AM

Share

Karun Nair Century: సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టులోకి (టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు, ప్రస్తుతం ఇండియా ‘A’ తరపున ఆడుతున్నాడు) పునరాగమనం చేసిన అనుభవజ్ఞుడైన బ్యాటర్ కరుణ్ నాయర్.. ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాడు. మే 30, 2025న కాంటర్బరీలోని సెయింట్ లారెన్స్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో ప్రారంభమైన మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో కరుణ్ నాయర్ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. ఈ ప్రదర్శనతో, త్వరలో ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను నిరూపించుకోవడమే కాకుండా, భారత జట్టులో తన స్థానానికి మరింత బలాన్ని చేకూర్చుకున్నాడు.

విమర్శకుల నోరు మూయించిన ఇన్నింగ్స్..

ఇవి కూడా చదవండి

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కరుణ్ నాయర్‌కు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో, ఇంగ్లాండ్ పర్యటనలో అతని ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, భారత ‘A’ జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నాయర్, తన అనుభవాన్నంతా రంగరించి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ (92 పరుగులు)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓపికగా ఆడుతూనే, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. తన క్లాసీ షాట్లతో అలరించిన కరుణ్, 155 బంతుల్లో తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 24వ సెంచరీ కావడం విశేషం. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్ 186 పరుగులతో అజేయంగా నిలిచి, భారత ‘A’ జట్టు భారీ స్కోరు (409/3) సాధించడంలో ప్రధాన భూమిక పోషించాడు.

భారత జట్టుకు శుభసూచకం..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత, భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే క్రమంలో కరుణ్ నాయర్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి ఫామ్ జట్టుకు ఎంతో కీలకం. గతంలో ఇంగ్లాండ్‌పైనే ట్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత కరుణ్ నాయర్‌కు ఉంది. ఇప్పుడు మళ్లీ ఇంగ్లీష్ గడ్డపై, అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతూ సెంచరీతో పర్యటనను ప్రారంభించడం భారత జట్టుకు శుభసూచకంగా పరిగణించవచ్చు. ఈ ఫామ్‌ను అతను రాబోయే టెస్ట్ సిరీస్‌లో కూడా కొనసాగిస్తే, భారత మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టం అవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్, రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌లో అతని పాత్ర ఎంత కీలకమో చెప్పకనే చెబుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..