IND vs ENG: ఇక్కడ టాస్ ఓడిన వారే బాస్.. అడిలైడ్ గ్రౌండ్ చరిత్ర చెబుతోంది ఇదే మరి..
ఆడిలైడ్ మైదానం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ప్రతి ఆటగాడి పాత్ర కీలకం కానుండగా, టాస్ కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఇక్కడ టాస్ ఓడిపోతేనే భారత్‌కు ఫైనల్‌కి చేరుకుంటుంది.
T20 ప్రపంచకప్ 2022 చివరి రౌండ్‌కు చేరుకుంది. ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న అడిలైడ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది.ఈ టోర్నీలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ప్రయాణం ఇప్పటివరకు అద్భుతంగా సాగింది. స్టార్ ప్లేయర్‌లు జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజా లేకుండానే 5 మ్యాచ్‌లలో 4 గెలిచి నాకౌట్ రౌండ్‌కు చేరుకుంది.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని బలమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఆడిలైడ్ మైదానం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ప్రతి ఆటగాడి పాత్ర కీలకం కానుండగా, టాస్ కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఇక్కడ టాస్ ఓడిపోతేనే భారత్‌కు ఫైనల్‌కి చేరుకుంటుంది. ఇప్పటి వరకు అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ఇక్కడ టాస్ గెలిచి మ్యాచ్ గెలవడం కష్టమే.
టాస్ ఓడితేనే విజయం..
అడిలైడ్‌లో ఇప్పటివరకు 11 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగగా, టాస్ ఓడిన జట్టే అన్ని సార్లు విజయం సాధించింది. ఈ రికార్డులను పరిశీలిస్తే, టీమిండియా కూడా టాస్ ఓడిపోవాలని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో భారత్ టాస్ గెలిచినా.. ఈ రికార్డును తుడిచేసే బాధ్యత కూడా మన జట్టుదేనంటున్నారు.
రోహిత్ ఫిట్ ..
సెమీఫైనల్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయం సమస్య కూడా అందరినీ ఆందోళనకు గురి చేసింది. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకుని సెమీఫైనల్‌కు సిద్ధమయ్యాడు. వాస్తవానికి, అతను నెట్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. దీంతో అతను దాదాపు 40 నిమిషాల పాటు మైదానం వీడాడు. అయితే విశ్రాంతి తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్ ప్రాక్టీస్ కొనసాగించాడు.
చరిత్రకు 2 అడుగుల దూరంలో..
2007 తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు టీమ్ ఇండియా కేవలం 2 అడుగులు మాత్రమే ఉంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్ గెలుపొందడంపై అందరి దృష్టి ఉంది. అయితే అంతకంటే ముందు భారత్, ఇంగ్లండ్ జట్టును ఓడించాలి. ఇక టోర్నీ టైటిల్ మ్యాచ్ నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో జరగనుంది.
?️?️ #TeamIndia captain @ImRo45 ahead of the semifinal clash in the #T20WorldCup against England. #INDvENG pic.twitter.com/GLRCWAvO5f
— BCCI (@BCCI) November 9, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..