T20 World Cup 2021, IND vs NZ Match Result: టీమిండియా సెమీస్ ఆశలపై నీళ్లు.. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం
భారత్ విధించిన అత్యల్ప టార్గెట్‌ను కేవలం 14.3 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధిచింది. దీంతో కివీస్ టీం సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా ఆశలు మాత్రం విరిగిపోయాయి.
Highlights of T20 World Cup 2021 Match Result, Know Who Won India vs New Zealand Match on 30 10 2021: టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ టీం ఘన విజయం సాధించింది. భారత్ విధించిన అత్యల్ప టార్గెట్‌ను కేవలం 14.3 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధిచింది. దీంతో కివీస్ టీం సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా ఆశలు మాత్రం విరిగిపోయాయి.
న్యూజిలాండ్ టీం ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(20 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు), మిచెల్ (49 పరుగులు, 35 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) భారత ఆశలపై నీళ్లు చల్లి, భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపిస్తూ న్యూజిలాండ్ టీంను విజయం వైపు నడిపించారు. అయితే బుమ్రా బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి మార్టిలన్ గుప్తిల్ పెవిలియన్ చేరాడు. అయితే 4 ఓవర్లలోనే కివీస్ తొలి వికెట్‌ను పడగొట్టినా.. ఆ ఆనందం భారత శిభిరంలో కొద్దిసేపు కూడా ఉంచకుండా చేశాడు మరో ఓపెనర్ మిచెల్. భారత బౌలర్లపై వీర విహారం చేస్తూ.. బౌండరీలు బాదుతూ కోహ్లీసేనను సెమీస్ నుంచి దూరం చేశాడు. వీరిద్దరు పెవిలియన్ చేరాక కెప్టెన్ విలియమ్సన్ 33, కాన్వే 2 మిగతా పనిని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీశాడు.
టీమిండియా కీలక మ్యాచులో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను పంపించింది. అయితే ఈ మార్పు పెద్దగా ఫలించలేదు. ఇషాన్ కిషన్ (4) ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్ (18 పరుగులు, 16 బంతులు, 3 ఫోర్లు) సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి, పేలవ ఆటతీరును కనబరిచింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన సమయంలో రోహిత్ శర్మ (14 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో టోర్నీలో ఆడుతోన్న రెండో మ్యాచులో కూడా టీమిండియా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తోంది. ఆ వెంటనే కోహ్లీ (9 పరుగులు) కూడా ఓ రాంగ్ షాట్ ఆడే క్రమంలో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పంత్ 8, పాండ్యా 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా వరుస వికెట్లు కోల్పోయి, రన్‌రేట్ తక్కువలో ఉండటంతో.. బ్యాటర్లు భారీ షాట్స్‌కు యత్నించి పెవిలియన్ చేరుతున్నారు. ఈ క్రమంలోనే పంత్(12) ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్నే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం హార్దిక్ పాండ్యా (23 పరుగులు, 24 బంతులు, 1ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో లేకుండానే పెవిలయన్ చేరాడు. అనంతరం ఇదే ఓవర్‌లో శార్దుల్ (0) కూడా పెవిలియన్ చేరాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 3, సోథీ 2 వికెట్లు, సౌథీ, ఆడం మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.
A sparkling performance from New Zealand ✨#T20WorldCup | #INDvNZ | https://t.co/n7B0Dl7ph0 pic.twitter.com/zRgbp54vOW
— ICC (@ICC) October 31, 2021