AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 Full Schedule : 20 టీమ్‌లు, 55 మ్యాచ్‌లు, 8 స్టేడియాలు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7, 2026న మొదలై, మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. వీరు 55 మ్యాచ్‌లు ఆడతారు.

T20 World Cup 2026 Full Schedule : 20 టీమ్‌లు, 55 మ్యాచ్‌లు,  8 స్టేడియాలు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల
T20 World Cup 2026 (1)
Rakesh
|

Updated on: Nov 26, 2025 | 11:34 AM

Share

T20 World Cup 2026 Full Schedule : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7, 2026న మొదలై, మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. వీరు 55 మ్యాచ్‌లు ఆడతారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు భారత్, శ్రీలంకలో కలిపి మొత్తం 8 స్టేడియాల్లో జరుగుతాయి. ఇందులో 5 స్టేడియాలు భారతదేశంలో ఉన్నాయి, 3 స్టేడియాలు శ్రీలంకలో ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. గ్రూప్ దశ ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్‌లు (మొత్తం 8 టీమ్‌లు) సూపర్ 8కి వెళ్తాయి.

భారతీయ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15, ఆదివారం నాడు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతుంది. టీమిండియా తమ మొదటి మ్యాచ్‌ను టోర్నమెంట్ ప్రారంభమైన రోజునే, అంటే ఫిబ్రవరి 7, శనివారం నాడు అమెరికాతో ముంబైలో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో, ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో ఆడనుంది.

టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న సాయంత్రం 7 గంటల నుంచి జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు వేదిక సాధారణంగా అహ్మదాబాద్‌గా నిర్ణయించారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే, భద్రతా కారణాల వల్ల ఆ ఫైనల్ మ్యాచ్ కొలంబోకు మారుస్తారు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు మార్చి 4న కోల్‌కతా/కొలంబోలో మార్చి 5న ముంబైలో జరుగుతాయి.

ఐసీసీ ప్రకటించిన 2026 T20 ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ ఈ విధంగా ఉంది..

ప్రారంభ రోజు (ఫిబ్రవరి 7, శనివారం):

పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (కొలంబో, ఉదయం 11)

వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (కోల్‌కతా, మధ్యాహ్నం 3)

భారత్ vs అమెరికా (USA) (ముంబై, రాత్రి 7)

ఫిబ్రవరి 8, ఆదివారం:

న్యూజిలాండ్ vs అఫ్గానిస్తాన్ (చెన్నై, ఉదయం 11)

ఇంగ్లాండ్ vs నేపాల్ (ఢిల్లీ, మధ్యాహ్నం 3)

శ్రీలంక vs ఐర్లాండ్ (కొలంబో, రాత్రి 7)

ఫిబ్రవరి 9, సోమవారం:

బంగ్లాదేశ్ vs ఇటలీ (కోల్‌కతా, ఉదయం 11)

జింబాబ్వే vs ఒమన్ (కొలంబో, మధ్యాహ్నం 3)

సౌత్ ఆఫ్రికా vs కెనడా (అహ్మదాబాద్, రాత్రి 7)

ఫిబ్రవరి 10, మంగళవారం:

నెదర్లాండ్స్ vs నమీబియా (ఢిల్లీ, ఉదయం 11)

న్యూజిలాండ్ vs యూఏఈ (చెన్నై, మధ్యాహ్నం 3)

పాకిస్తాన్ vs యూఎస్ఏ (ముంబై, రాత్రి 7)

ఫిబ్రవరి 11, బుధవారం:

సౌత్ ఆఫ్రికా vs అఫ్గానిస్తాన్ (అహ్మదాబాద్, ఉదయం 11)

ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ (కొలంబో, మధ్యాహ్నం 3)

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7)

ఫిబ్రవరి 12, గురువారం:

శ్రీలంక vs ఒమన్ (క్యాండీ, ఉదయం 11)

నేపాల్ vs ఇటలీ (ముంబై, మధ్యాహ్నం 3)

భారత్ vs నమీబియా (ఢిల్లీ, రాత్రి 7)

ఫిబ్రవరి 13, శుక్రవారం:

ఆస్ట్రేలియా vs జింబాబ్వే (కొలంబో, ఉదయం 11)

కెనడా vs యూఏఈ (ఢిల్లీ, మధ్యాహ్నం 3)

యూఎస్ఏ vs నెదర్లాండ్స్ (కొలంబో, రాత్రి 7)

ఫిబ్రవరి 14, శనివారం:

ఐర్లాండ్ vs ఒమన్ (క్యాండీ, ఉదయం 11)

ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (కొలంబో, మధ్యాహ్నం 3)

న్యూజిలాండ్ vs సౌత్ ఆఫ్రికా (అహ్మదాబాద్, రాత్రి 7)

అత్యంత ముఖ్యమైన మ్యాచ్ (ఫిబ్రవరి 15, ఆదివారం):

వెస్టిండీస్ vs నేపాల్ (ముంబై, ఉదయం 11)

యూఎస్ఏ vs నమీబియా (చెన్నై, మధ్యాహ్నం 3)

భారత్ vs పాకిస్తాన్ (కొలంబో, రాత్రి 7)

ఫిబ్రవరి 16, సోమవారం:

అఫ్గానిస్తాన్ vs యూఏఈ (ఢిల్లీ, ఉదయం 11)

ఇంగ్లాండ్ vs ఇటలీ (కోల్‌కతా, మధ్యాహ్నం 3)

ఆస్ట్రేలియా vs శ్రీలంక (క్యాండీ, రాత్రి 7)

ఫిబ్రవరి 17, మంగళవారం:

న్యూజిలాండ్ vs కెనడా (చెన్నై, ఉదయం 11)

ఐర్లాండ్ vs జింబాబ్వే (క్యాండీ, మధ్యాహ్నం 3)

బంగ్లాదేశ్ vs నేపాల్ (ముంబై, రాత్రి 7)

ఫిబ్రవరి 18, బుధవారం:

సౌత్ ఆఫ్రికా vs యూఏఈ (ఢిల్లీ, ఉదయం 11)

పాకిస్తాన్ vs నమీబియా (కొలంబో, మధ్యాహ్నం 3)

భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్, రాత్రి 7)

ఫిబ్రవరి 19, గురువారం:

వెస్టిండీస్ vs ఇటలీ (కోల్‌కతా, ఉదయం 11)

శ్రీలంక vs జింబాబ్వే (కొలంబో, మధ్యాహ్నం 3)

అఫ్గానిస్తాన్ vs కెనడా (చెన్నై, రాత్రి 7)

ఫిబ్రవరి 20, శుక్రవారం:

ఆస్ట్రేలియా vs ఒమన్ (క్యాండీ, రాత్రి 7)

సూపర్-8 రౌండ్ (ఫిబ్రవరి 21 – మార్చి 1):

గ్రూప్ స్టేజ్‌లో టాప్-2లో నిలిచిన 8 జట్లు ఈ రౌండ్‌లో తలపడతాయి. మ్యాచ్‌లు ప్రధానంగా కొలంబో, క్యాండీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా వేదికల్లో జరుగుతాయి.

ఫిబ్రవరి 21 – Y2 vs Y3 (కొలంబో, రాత్రి 7)

ఫిబ్రవరి 22 – Y1 vs Y4 (క్యాండీ, మధ్యాహ్నం 3), X1 vs X4 (అహ్మదాబాద్, రాత్రి 7)

ఫిబ్రవరి 23 – X2 vs X3 (ముంబై, రాత్రి 7)

ఫిబ్రవరి 24 – Y1 vs Y3 (క్యాండీ, రాత్రి 7)

ఫిబ్రవరి 25 – Y2 vs Y4 (కొలంబో, రాత్రి 7)

ఫిబ్రవరి 26 – X3 vs X4 (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3), X1 vs X2 (చెన్నై, రాత్రి 7)

ఫిబ్రవరి 27 – Y1 vs Y2 (కొలంబో, రాత్రి 7)

ఫిబ్రవరి 28 – Y3 vs Y4 (క్యాండీ, రాత్రి 7)

మార్చి 1 – X2 vs X4 (ఢిల్లీ, మధ్యాహ్నం 3), X1 vs X3 (కోల్‌కతా, రాత్రి 7)

నాకౌట్ మ్యాచ్‌లు:

సెమీ-ఫైనల్ 1: మార్చి 4, బుధవారం (కోల్‌కతా / కొలంబో, రాత్రి 7)

సెమీ-ఫైనల్ 2: మార్చి 5, గురువారం (ముంబై, రాత్రి 7)

ఫైనల్: మార్చి 8, ఆదివారం (అహ్మదాబాద్ / కొలంబో, రాత్రి 7)

క్వాలిఫై అయిన జట్లు: భారత్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ.

మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన