AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Kumble : కేఎల్ రాహుల్ చెత్త షాట్.. కోపాన్ని ఆపుకోలేక కామెంటరీ బాక్స్‌లో కుంబ్లే ఏం చేశాడంటే ?

గౌహతిలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కామెంటరీ బాక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన తన మాటలతోనే కాదు, కేఎల్ రాహుల్ ఔటైన విధానాన్ని చేతులతో చేసి చూపించడం ద్వారా సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించారు.

Anil Kumble : కేఎల్ రాహుల్ చెత్త షాట్.. కోపాన్ని ఆపుకోలేక కామెంటరీ బాక్స్‌లో కుంబ్లే ఏం చేశాడంటే ?
Anil Kumble
Rakesh
|

Updated on: Nov 26, 2025 | 11:11 AM

Share

Anil Kumble : గౌహతిలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కామెంటరీ బాక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన తన మాటలతోనే కాదు, కేఎల్ రాహుల్ ఔటైన విధానాన్ని చేతులతో చేసి చూపించడం ద్వారా సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించారు. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో రాహుల్ వికెట్ పడిన వెంటనే, క్రీజు నుంచి కదలకుండా అడ్డంగా ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ తప్పిదాన్ని కుంబ్లే వెంటనే అనుకరించి చూపించారు. ఈ దృశ్యం నిమిషాల వ్యవధిలోనే నెట్టింట్లో వైరల్ అయింది.

సౌతాఫ్రికా 522 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, భారత జట్టు విజయానికి ఇంకా ఎక్కువ పరుగులు కావాలి. ఈ దశలో సైమన్ హార్మర్ ను బౌలింగ్‌కు తీసుకొచ్చారు. పిచ్‌పై రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ స్టంప్‌కు వెలుపల ఏర్పడిన రఫ్ ఏరియాను హార్మర్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. హార్మర్ వేసిన డెలివరీలో స్పిన్, డ్రిఫ్ట్ బాగా ఉన్నాయి. రాహుల్ (6 పరుగులు) బంతిని డ్రైవ్ చేయాలని ముందుకెళ్లాడు.. కానీ బంతి పిచ్‌ను అందుకోలేదు. బంతి స్పిన్ అయి, అనూహ్యంగా లోపలికి తిరిగి స్టంప్స్‌ను తాకింది. రాహుల్ అడ్డంగా బ్యాట్ పెట్టడం వలన ఈ వికెట్ కోల్పోయాడు. అప్పటికి భారత్ స్కోర్ 27/2.

క్రికెట్ లైవ్ కార్యక్రమంలో ఈ వికెట్ గురించి విశ్లేషిస్తూ కుంబ్లే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “సైమన్ హార్మర్ వేసింది అద్భుతమైన ఆఫ్-స్పిన్నర్ డెలివరీ. కానీ కేఎల్ రాహుల్ చాలా తొందరగా షాట్‌కు కమిట్ అయ్యాడు. బంతి పిచ్‌ను చేరుకోవడానికి ముందే ఆడాడు” అని అన్నారు. “హార్మర్ బంతికి ఇచ్చినంత స్పిన్ వల్ల, అది డైవ్ అయ్యింది. రాహుల్ తన కాళ్లతో ఆ స్పిన్‌ను అడ్డుకోలేకపోయాడు. అందుకే ప్రమాదంలో పడ్డాడు” అని వివరించారు.

నాలుగో లేదా ఐదో రోజు పిచ్‌లపై అనుభవం ఉన్న బ్యాటర్లు ఎలా ఆడతారో కుంబ్లే వివరించారు. “ఆఫ్ స్టంప్ బయట రఫ్ ఉన్నప్పుడు, ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా మీరు మూడు స్టంప్స్‌ను కవర్ చేసుకుని ఆడతారు. రాహుల్ సెంటర్ తీసుకున్నప్పటికీ, అతని ఆఫ్-స్టంప్ ఇంకా బంతికి ఎక్స్‌పోజ్ అయి ఉంది. దీనికి తోడు అతను మిడిల్ అండ్ లెగ్ మీద గార్డ్ తీసుకున్నందున, బంతిని అందుకోవడానికి అతను బాగా సాగదీయాల్సి వచ్చింది . అందుకే ఆఫ్-స్టంప్ సులభంగా వికెట్‌కు తగిలింది” అని కుంబ్లే వివరించారు. ఇది ఒక చిన్న తప్పిదం అని పేర్కొన్న కుంబ్లే.. “బంతి డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉందని రాహుల్ భావించాడు. కానీ స్పిన్ అతన్ని మోసం చేసింది. హార్మర్‌కు క్రెడిట్ ఇవ్వాలి కానీ రాహుల్ అనవసరమైన షాట్ ఆడాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..