AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: ‘కాస్త బుద్ధుండాలి’.. ఇంజమామ్‌కు ఇచ్చిపడేసిన రోహిత్.. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఏమన్నాడంటే?

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌కు టీమ్ ఇండియా రెండు అడుగుల దూరంలో ఉంది. సెమీఫైనల్లో భారత్ మొదట ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.

T20 World Cup 2024: 'కాస్త బుద్ధుండాలి'.. ఇంజమామ్‌కు ఇచ్చిపడేసిన రోహిత్.. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఏమన్నాడంటే?
Inzamam Ul Haq, Rohit Sharma
Basha Shek
|

Updated on: Jun 27, 2024 | 4:05 PM

Share

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌కు టీమ్ ఇండియా రెండు అడుగుల దూరంలో ఉంది. సెమీఫైనల్లో భారత్ మొదట ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన ఆరోపణలపై హిట్ మ్యాన స్పందించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ఇంజమామ్ ఆరోపించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్‌ ఛానల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత ప్లేయర్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. మరో పాక్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ కూడా ఇంజమామ్ వ్యాఖ్యలను సమర్థించాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన బంతి రివర్స్‌ స్వింగ్‌ కావడంతో అంపైర్లు దానిపై ఓ కన్నేసి ఉంచాల్సిదన్నారు. అలాగే బాల్ ట్యాంపరింగ్ లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పాడు. ఇంజమామ్ కామెంట్లను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ గా తీసుకున్నాడు.

బ్రెయిన్ ఉపయోగించాలి..

‘వెస్టిండీస్‌లో చాలా వేడిగా ఉంది. పిచ్‌లు కూడా పొడిగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో బంతి రివర్స్ స్వింగ్ కాకపోతే అది ఎక్కడ జరుగుతుంది? వెస్టిండీస్‌లోని పరిస్థితులు చాలా వేరు. మేము ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికాలో ఆడడం లేదు. ప్రతి జట్టుకు ఇదే పరిస్థితి. ఆరోపణలు చేసే ముందు కాస్త బ్రెయిన్ ఉపయోగించాలి’ అని ఇంజీకి కౌంటరిచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. సెమీఫైనల్స్ విషయంలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మనసు విప్పాడు. “టీమ్ ఇండియా ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటుంది. ప్రతి ఆటగాడు దానికి అలవాటు పడ్డాడు. జట్టు ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. నిశ్చింతగా ఉండడం మంచిది’ అని రోహిత్ శర్మ అన్నారు. ఈసారి గయానా పిచ్‌పై రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లకు అవకాశం ఇస్తారా? ఒక ప్రశ్న అడిగారు. పిచ్ చూసి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

కాగా మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది.  ఇందుకోసం రోహిత్ తుది జట్టులో కొన్ని మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో సంజూ శామ్సన్ లేదా యశస్వి జైస్వాల్ కు స్థానం కల్పించవచ్చని తెలుస్తోంది.

భారత్ జట్టు ప్లేయింగ్-XI (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..